కరక్కాయ, టీ లతో కరోనా కు చెక్..?
TeluguStop.com
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ వ్యాక్సిన్ మాత్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో.
ప్రజలందరూ కరోనా వైరస్ నుంచి రక్షించుకునేందుకు ఉన్న అన్ని మార్గాలనూ ఫాలో అవుతున్నారు.
అంతే కాకుండా కొత్త మార్గాల కోసం కూడా వెతుకుతున్నారు.ఇదే సమయంలో అటు పరిశోధకులు కూడా ఈ వైరస్ వ్యాధి బారి నుంచి తప్పించుకునేందుకు ఆయుర్వేద ఔషధాల గురించి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.
అయితే తాజాగా ఐఐటీ ఢిల్లీ చేసిన అధ్యయనంలో ఓ ఆసక్తికర విషయం వెల్లడయింది.
కరక్కాయ టీ నుంచి తీసిన పదార్థాల గుజ్జులో కరోనా సంక్రమణ కు వ్యతిరేకంగా పోరాడగల సామర్థ్యం ఉంది అంటూ తాజా అధ్యయనంలో వెల్లడైనట్లు పరిశోధకులు తెలిపారు.
కరక్కాయ, టీలలో గాల్లోటానిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుందని.ఈ పదార్థానికి కరోనా వైరస్ ను అంతం చేసే సామర్థ్యం ఉంటుంది అంటూ పరిశోధకులు చెబుతున్నారు.
51 ఔషధ మొక్కలను పరిశీలించగా టీ కరక్కాయ లోని పదార్థం కరోనా వైరస్ నియంత్రిస్తుందని తేలింది అంటూ చెప్పుకొచ్చారు శాస్త్రవేత్తలు.
బరువు పెరగాలంటూ కామెంట్ చేసిన నెటిజన్.. సమంత ఇచ్చిపడేసిందిగా!