కెనడా : సిద్ధూ మూసేవాలాకు నివాళులర్పించిన కపిల్ శర్మ .. స్టేజ్ ఊగిపోయిందిగా..!!

పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా దారుణహత్యతో ప్రపంచవ్యాప్తంగా వున్న ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

సిద్ధూ మరణించి రోజులు గడుస్తున్నా ఫ్యాన్స్ మాత్రం షాక్ నుంచి తేరుకోలేదు.ఆయన పాటలను, మాటలను, ఫోటోలను షేర్ చేస్తూనే వున్నారు.

తాజాగా కెనడాలోని వాంకోవర్‌లో జరిగిన స్టేజ్ షోలో స్టాండ్ అప్ కమెడియన్, ప్రముఖ వ్యాఖ్యాత కపిల్ శర్మ సైతం దివంగత సిద్ధూ మూసేవాలాకు నివాళులర్పించారు.

ఈ సందర్బంగా ప్రేక్షకుల కేరింతల మధ్య సిద్ధూ పాడిన ఫేమస్ సాంగ్ ‘295’ని కపిల్ శర్మ ఆలపించారు.

కపిల్ స్టేజ్ షో బ్యాక్‌గ్రౌండ్‌లో ఇటీవల మరణించిన సిద్ధూ మూసేవాలాతో పాటు కేకే చిత్రాలు వున్నాయి.

ఇకపోతే.జూన్ 11న సిద్ధూ మూసేవాలా జన్మదినాన్ని పురస్కరించుకుని న్యూయార్క్‌లోని ఐకానిక్ టైమ్స్ స్వ్కేర్‌లోని స్క్రీన్‌పై సిద్ధూ పాటలను ప్లే చేసి ఆయనకు నివాళుర్పించారు.

అలాగే కొరియాకు చెందిన జోంగ్ సూ అనే అభిమాని సిద్ధూపై అభిమానాన్ని చాటుకున్నారు.

సిద్ధూ పాపులర్ ట్రాక్‌ ‘‘295’’ను పర్ఫెక్ట్ పిచ్‌తో పాడాడు.ఇందుకు సంబంధించిన వీడియోను తన @mylovefromkorea17 పోస్ట్ చేశాడు.

భారతీయుడు కాకపోయినా సిద్ధూ మూసేవాలాపై తన ప్రేమను చూపిన జోంగ్ సూను పలువురు అభినందిస్తున్నారు.

"""/"/ ఇటీవల ‘295’ ట్రాక్.బిల్‌బోర్డ్ గ్లోబల్‌ 200 చార్ట్‌లో చేరింది.

ఈ నెల ప్రారంభంలో ఈ పాట 154వ స్థానంలో వుండగా.యూట్యూబ్‌లో దాని వీక్షకుల సంఖ్య 200 మిలియన్ మార్కును దాటడంతో ఈ ఘనత సాధించింది.

కాగా.మే 29న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని జవహర్కే గ్రామ సమీపంలో దుండ‌గులు జ‌రిగిన కాల్పుల్లో సిద్ధూ ముసేవాలా మ‌ర‌ణించిన సంగతి తెలిసిందే.

పంజాబ్‌లో 424 మంది వీఐపీలకు భద్రతను ఉపసంహరిస్తున్నట్టు ఆప్ ప్రభుత్వం ప్రకటన చేసిన మరునాడే సిద్ధూ దారుణ హత్య దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఈ హత్యకు బాధ్యత వహిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు.

ఈ హత్యకు సూత్రదారిగా అనుమానిస్తున్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్‌కి గోల్డీ బ్రార్ అత్యంత సన్నిహితుడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?