రోహిత్ శర్మ ఫిట్ నెస్ పై కపిల్ దేవ్ కామెంట్స్.. ఇంకా తగ్గాలంటూ..!

తాజాగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్ నెస్ పై కపిల్ దేవ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రోహిత్ శర్మ మంచి బ్యాటర్, మంచి కెప్టెన్ అయినా కూడా ఫిట్ నెస్ అనేది చాలా ముఖ్యమైన విషయం అంటూ కొన్ని సూచనలు చేశాడు.

మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదట్లో రోహిత్ శర్మ లాగే బొద్దుగా ఉండేవాడు.

డైట్ ఫాలో అవడం, కఠినమైన ఎక్సర్సైజులు చేయడం వల్ల ఫిట్ నెస్ అంటే విరాట్ కోహ్లీ లా ఉండాలి అనే విధంగా తయారయ్యాడు.

రోహిత్ శర్మ మాత్రం మొదట్లో ఎలా ఉన్నాడో, ఇప్పుడు అలాగే ఉండడంతో తరచూ విమర్శలు వస్తూనే ఉన్నాయి.

రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి ఇండియన్ కెప్టెన్ అయినప్పటికీ, ఫిట్ నెస్ ను రోహిత్ శర్మ కాస్త సీరియస్ గా తీసుకొని దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

కెప్టెన్ అంటే టీంలో సభ్యులకు ఆదర్శంగా ఉండాలి.ఈ విషయంలో కోహ్లీ అందరికీ ఆదర్శంగా నిలిచారని పొగుడుతూ, రోహిత్ శర్మ పై కామెంట్స్ చేశాడు.

"""/"/ ఏది ఏమైనప్పటికీ కపిల్ దేవ్ చేసిన ఈ వ్యాఖ్యల వల్ల రోహిత్ మరియు కోహ్లీ అభిమానుల మధ్య అగ్గి రాజేసినట్టయింది.

గతంలోనూ రోహిత్ ఇలాంటి విమర్శలమే ఎదుర్కొన్నాడు.తన అధిక బరువు కొన్ని సందర్భాల్లో ఆటపై కూడా ప్రభావం చూపించింది.

"""/"/ ఇక బార్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా భారత్ ఆసీస్ మధ్య జరిగిన రెండు టెస్ట్ మ్యాచుల్లోనూ భారత్ ఘనవిజయం సాధించింది తదుపరి మ్యాచ్ మార్చి 1వ తేదీన జరగనుండగా ఇరుజట్లు మ్యాచ్ గెలవాలని కసరతులు చేస్తున్నాయి.

మూడో టెస్టులో భారత్ గెలిస్తే ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉంటుంది.

మహేష్, బన్నీ, రవితేజ తర్వాత నితిన్.. ఈ యంగ్ హీరో ప్లాన్ అదుర్స్ అంటూ?