అమెరికా అధ్యక్ష రేసులోకి హాలీవుడ్ హాట్ బాంబ్ భర్త

అంతర్జాతీయంగా ఓ వైపు కరోనా హాట్ టాపిక్ గా ఉండగా మరో వైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా అంతే ట్రెండింగ్ టాపిక్ గా ఉంది.

మరో నాలుగు నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది.ఇప్పటికే అధ్యక్ష రేసులో ప్రస్తుత అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రత్యర్ధిగా జో బిడెన్ రేసులో ఉన్నారు.

వీరి మధ్య పోటీ రసవత్తరంగా ఉండబోతుంది అని ప్రచారం జరుగుతుంది.మరో వైపు అమెరికా ప్రజలలో ట్రంప్ మీద తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ సారి డెమొక్రాట్ల తరుపున బరిలో నిలబడిన జో బిడెన్ గెలిచే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.

అయితే ఇంతలో ఊహించని విధంగా డోనాల్డ్ ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్ నుంచి మరో వ్యక్తి అధ్యక్ష రేసులోకి వచ్చాడు.

హాలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కిమ్ కర్దాషియన్ భర్త కెన్యే వెస్ట్ అధ్యక్ష రేసులోకి వచ్చాడు.

తాను కూడా పోటీలో ఉన్నానని ప్రకటించాడు.ట్రంప్ కు గతంలో మద్దతు పలికిన కెన్యే, ఇప్పుడు ఆయన్నే చాలెంజ్ చేస్తున్నారు.

టెస్లా అధినేత ఎలాన్ ముస్క్ ఆయనకు మద్దతు పలకడంతో, దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది.

తాను మాజీ ఉపాధ్యక్షుడు ప్రస్తుతం డెమోక్రాట్ల తరఫున పోటీ చేస్తున్న జో బిడెన్ తో పోటీ పడతానని వెస్ట్ ప్రకటించారు.

అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులకు కావాల్సిన కనీస మద్దతుదారుల కోసం పోలింగ్ ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో, తనకూ అవకాశాలు ఉన్నాయని ఆయన అంటున్నారు.

దేవుడిపై నమ్మకం ఉంచే అమెరికన్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సి వుంది.మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవాలి అని కెన్యే వెస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

మరి తన పార్టీ నుంచి తనకి పోటీగా రేసులోకి వచ్చిన వెస్ట్ గురించి ట్రంప్ ఎలా స్పందిస్తాడు అనేది వేచి చూడాలి.

పెళ్లయి పిల్లలు ఉంటే ఇంట్లోనే ఉండాలా… వారికి గట్టి కౌంటర్ ఇచ్చిన అనసూయ?