ముచ్చర్లలో కంటి వెలుగు ప్రారంభం

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం పేదల కళ్ళల్లో ఆనందం నింపడం కోసమే కంటి వెలుగు కార్యక్రమం.

గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామంలో ఎంపీటీసీ వంగ స్వప్న,సర్పంచ్ తేజవాత్ రజిత లు ప్రారంభించారు.

అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ముందు చూపుతో రాష్ట్రంలో ప్రజలందరికీ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారని ఎవరూ కంటి సమస్యలతో బాధపడవద్దనే లక్ష్యంతో కంటి పరీక్షలను నిర్వహించి అద్దాలతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని, అవసరమైన వారికి కంటి ఆపరేషన్లను సైతం చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.గతంలో పాలనలో ఉన్న ఏ ప్రభుత్వాలు ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాల్ని చేపట్టలేదని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందిస్తూ కుటుంబంలో పెద్దకొడుకులా వ్యవహరిస్తున్నారన్నారు.

రానున్న రోజుల్లో మరిన్ని సేవ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించడమే ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్నారు.

అనంతరం పలువురు కంటి పరీక్షలు నిర్వహించుకున్న వారికి మందులు, అద్దాలను అందించారు.అనంతరం ముగ్గురు అర్హులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు ఈ కార్యక్రమంలో వైద్యులు వేణుగోపాల్, శ్రీనివాస్, యోగేందర్, రాము, వంగ రవీందర్ రెడ్డి,అనిల్, కార్యదర్శి శ్రీధర్, వార్డు మెంబర్ లింగం, బిక్షపతి,ఏఎన్ఎం కవిత, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

ఆడోళ్లు చూడకపోయినా సెన్సేషనల్ హిట్టైన కృష్ణ మూవీ.. ఏదంటే..?