కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ఎంపీపీ పడిగెల మానస రాజు

రాజన్న సిరిసిల్ల జిల్లా:కంటి వెలుగును ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరిన తంగళ్ళపల్లి ఎంపీపీ పడిగల మానస రాజు.

ఈ సందర్భంగా రామన్నపల్లె గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు.

కంటి వెలుగు కార్యక్రమంలో కంటి పరీక్షలతో పాటు కంటి అద్దాలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని తెలిపారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణ గా రాష్ట్రం మారుతుందన్నారు.అనంతరం కంటి పరీక్షలు చేసుకున్న పలువురికి కంటి అద్దాలను అందజేసిన నాయకులు ప్రజాప్రతినిధులు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆత్మకూరి రంగయ్య,ఎంపీటీసీ పుర్మాని కనకలక్ష్మి, ప్యాక్స్ చేర్మేన్ బండి దేవదాస్, వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు రాజన్న,డా.

విక్రమ్, ఉప సర్పంచ్ నారాయణరెడ్డి, డైరెక్టర్ ప్రమీల, జాగృతి మండలాధ్యక్షులు కందుకూరి రామ గౌడ్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు చిలువేరి సంజీవ్ గ్రామ శాఖ అద్యకులు శ్రీనివాస్,గ్రామస్తులు పాల్గొన్నారు.

హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే తమలపాకులు.. ఎలా వాడాలంటే?