కాంతార తర్వాత ఎక్కువగా తెలుగు ప్రేక్షకులు చూస్తున్న సినిమా ఇదే

కన్నడం లో రూపొందిన కాంతార సినిమా ను తెలుగు లో అల్లు అరవింద్ డబ్బింగ్ చేసి విడుదల చేసిన విషయం తెల్సిందే.

భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా వసూళ్లు రికార్డు దిశగా దూసుకు పోతున్నాయి.

కేజీఎఫ్ ను మించి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని.డబ్బింగ్ సినిమా ల్లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన సినిమా గా ఈ సినిమా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ అంతా చాలా నమ్మకంగా చెబుతున్నారు.

ప్రస్తుతం కాంతార సినిమా కు వస్తున్న వసూళ్ల ను చూస్తూ ఉంటే ఇతర హీరోల సినిమాల పరిస్థితి దారుణం అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా కాంతార యొక్క జపం వినిపిస్తుంది.

ఈ సమయంలో కాంతార సినిమా యొక్క వసూళ్ల గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.

కాంతార తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా చూస్తున్న సినిమా గా ఓరి దేవుడా నిలిచింది.

"""/"/ వెంకటేష్ కీలక గెస్ట్‌ పాత్రలో నటించడం వల్ల తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

అత్యల్పంగా సినిమా ను జిన్నా ను చూస్తున్నారు.ఇప్పటికే 80 శాతం వరకు స్క్రీన్స్ ను తగ్గించారట.

దాంతో పాటు తమిళ సినిమా సర్దార్‌ ను తెలుగు లో డబ్‌ చేశారు.

ఆ సినిమా కూడా తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఆధరణ కి నోచుకోలేదు.అంతే కాకుండా జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ప్రిన్స్ సినిమా ను కూడా జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు.

పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాలు సాధించని కలెక్షన్స్ కాంతార రాబడుతోంది.ఆ తర్వాత ఓరి దేవుడా సినిమా రాబడుతున్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

కాంతార సినిమా వసూళ్లు మరో రెండు వారాలు కొనసాగినా ఆశ్చర్యం లేదంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.

జానీ మాస్టర్ కు కౌంటర్ ఇచ్చిన శ్రేష్ట వర్మ.. ఆ కామెంట్లపై క్లారిటీ వచ్చేసిందిగా!