కాంతార క్లైమాక్స్ పర్ఫామెన్స్‌ని ఇరగదీసిన నూకరాజు.. వీడియో వైరల్?
TeluguStop.com
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
జబర్దస్త్ కామెడీ షోకి పోటీగా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ షో వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
కాగా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా జబర్దస్త్ కమెడియన్స్ వారి కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు.
ప్రతి ఆదివారం రోజు ప్రసారమయ్యే ఈ షో కొత్త కొత్త కాన్సెప్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈవారం మరొక సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులు ముందుకు రానుంది.కాగా ఈ వారం మదర్స్-డాటర్స్ అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.అయితే ఈ ప్రోమోలో సుధీర్ కనిపించి అందరిని షాక్ గురిచేశాడు.
సుధీర్ మళ్లీ గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇవ్వడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
సుధీర్ అయితే వచ్చి రావడంతోనే రష్మితో పులిహోర కలపడం మొదలు పెట్టేసాడు.కాగా ఈ ప్రోమో ఎండింగ్ లో అయితే నూకరాజు కాంతార సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశాన్ని తన పర్ఫామెన్స్ తో ఇరగదీసాడు.
కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరో కమ్ డైరెక్టర్ గా వ్యవహరించిన కాంతార సినిమా హెచ్డి వలె విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.
"""/"/
దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లను సాధించడంతోపాటు రికార్డులను సైతం బద్దలు కొట్టింది.
ఈ సినిమా మొదటినుంచి అద్భుతంగా ఉన్నప్పటికీ ఈ సినిమాలో చివరి 20 నిమిషాలు సన్నివేశం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా తెరకెక్కించారు రిషబ్ శెట్టి.
తాజాగా నూకరాజు ‘కాంతార గా చేసిన నటన ప్రోమోకు హైలెట్ గా నిలిచింది.
కాంతార సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా నూకరాజు ఈ సన్నివేశంలో నటించాడు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి20, గురువారం2025