ట్రిపుల్ ఆర్-కేజిఎఫ్.. తర్వాత ఇదే బ్లాక్ బస్టర్ హిట్!
TeluguStop.com
పక్క భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులోకి రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
మరి అదే క్యాటగిరీలో రిలీజ్ కి వస్తున్న సినిమా కాంతారా.రిషబ్ శెట్టి నటించిన ఈ సినిమా కన్నడంలో రిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయి వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ దగ్గర అసాధారణమైన విజయాన్ని నమోదు చేసుకుంది.
ఇక ఈ సినిమా పరుగులు చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.ఇప్పటికే కాంతారా సినిమా బాక్సాఫీస్ దగ్గర 58 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది.
ఈ సినిమా రెండవ వారంలోనే ఏకంగా 36 కోట్లు కలెక్ట్ చేసి వండర్ క్రియేట్ చేసింది.
ఇది ఎమోషనల్ సినిమా కావడంతో కన్నడ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.అందుకే మొదటి వారం లాగానే రెండవ వారం కూడా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గకుండా రాణిస్తుంది.
కన్నడ ట్రేడ్ వర్గాలు చెబుతున్న ప్రకారం కాంతారా సినిమా కర్ణాటకలో రోజువారీ కేజిఎఫ్ చాప్టర్ 2 ను కూడా బీట్ చేస్తుందట.
దీంతో అందరు ఆశ్చర్య పోతున్నారు.కర్ణాటకలో కేజిఎఫ్ 171.
50 కోట్లు కలెక్ట్ చేయగా.ట్రిపుల్ ఆర్ 86 కోట్లు వసూళ్లు చేసింది.
ఇక అక్కడ కాంతారా సినిమానే అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ సినిమాగా నిలిచి రికార్డ్ కెక్కింది.
ఇక ఈ సినిమా కన్నడ లోనే 100 కోట్లు సాధించిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అంటున్నారు.
"""/"/
మరి ఈ సినిమా మూడంకెల సంఖ్య నమోదు చేయాలంటే మూడవ వారంలో కూడా బాగా వసూళ్లు చేయాల్సిందే.
ఇక ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్స్ కూడా వచ్చే వారం రిలీజ్ చేయబోతున్నారు.
తెలుగు కాంతారా వర్షన్ ను అదే పేరుతొ అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నారు.
మరి హిందీ, తెలుగులో కూడా పాజిటివ్ టాక్ వస్తే మరిన్ని కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది.
చూడాలి ఈ సినిమాకు ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.
రాజమౌళి ఫస్ట్ లవ్ స్టోరీ మీకు తెలుసా.. ఈ విషయాలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!