కన్నడ ట్రోలర్లకు తెలుగు వారంటే ఇంత ద్వేషం ఎందుకు ..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి మన సినిమా అయినా పరభాష సినిమా అయినా ఒకటే.

సినిమాలో కంటెంట్ ఉంటే కచ్చితంగా ఆదరిస్తారు.అది మన తెలుగు ప్రజల గొప్పతనం.

కానీ కన్నడ సినిమా పరిశ్రమకు ఏమైందో ఏమో కానీ తెలుగు సినిమాపై విషం చిమ్ముతున్నారు.

ముఖ్యంగా కన్నడ భాష ట్రోలర్లు అయితే తెలుగు సినిమా వారిని అంటరాని వారిలా చూస్తున్నారు.

కాంతారా సినిమా సక్సెస్ అయ్యింది, కే జి ఎఫ్ సినిమాలు ప్రపంచానికి తమ భాషను పరిచయం చేశాయి.

వారిది గొప్ప భాష అయ్యుండొచ్చు కానీ వారి భాషను వారు అభిమానించుకున్నంత వరకు ఎలాంటి సమస్య లేదు.

అది పక్కవారిపై ద్వేషంగా మారితేనే అసలు సమస్య.ప్రస్తుతం కన్నడ ట్రోలర్ల మితిమీరిన భాషాభిమానం ఇతరుల పట్ల ద్వేషంగా మార్చుకుంటున్నారు.

ఇప్పుడు కన్నడ భాష అభిమానుల వల్ల ప్రశాంత నీల్ తన సోషల్ మీడియా అకౌంట్ అని రద్దు చేసుకున్నాడు.

అందుకు గల కారణం ప్రశాంత్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు దీని తర్వాత తారక్ తో ఒక సినిమా ఉంటుంది.

"""/"/ అంతకుముందు కేజిఎఫ్ సినిమాలు తీసి కన్నడ వారి ప్రేమను సంపాదించుకున్న ప్రశాంత్ ఇప్పుడు తెలుగు హీరోలను ఎంకరేజ్ చేస్తున్నాడు అనే సాకుతో అతనిపై ద్వేషాన్ని పెంచుకుంటున్నారు.

నిజానికి ప్రశాంత్ ఒక తెలుగు వ్యక్తి .అతడు మాజీ మంత్రి రఘువీరారెడ్డికి ఫ్యామిలీ మెంబర్.

అతడి పేరు ప్రశాంత్ మాత్రమే అతని స్వగ్రామం నీలకంఠాపురం.అందుకే ఆ పేరులోని నీల్ ని తన పేరులో జత చేసుకున్నాడు.

అసలు సమస్య అంతా రష్మిక దగ్గర మొదలైంది.ఆమె కన్నడ పరిశ్రమపై వ్యాఖ్యలు చేసింది.

"""/"/ దానికి రిషబ్ శెట్టి గట్టిగా బదులిచ్చాడు.వాస్తవానికి రష్మిక సమస్య అంతా కూడా ఆమె మాజీ ప్రేమికుడు రక్షిత్ శెట్టి పైన, అలాగే రక్షిత్ బ్యాచ్ అయినటువంటి మిగతా ఫ్రెండ్స్ పైన.

అక్కడ మొదలైన సమస్య చిలికి చిలికి గాలి వానగా మారి ప్రస్తుతం తెలుగు, కన్నడ అంటూ వేరు చేసి చూసేంతవరకు వచ్చింది.

కానీ మన తెలుగు వారికి ఆ సమస్య లేదు.మన వాళ్ళు పక్క భాషల్లో సినిమాలు తీస్తారు.

ఆ సినిమాలను తెలుగువారు చూస్తారు.కన్నడ వారి సినిమాలను మనం కూడా చూడకూడదు అని నిర్ణయించుకుంటే జరిగే ఫలితం ఎలా ఉంటుందో వారు అర్థం చేసుకోవాలి.

ఆ థియేటర్ లో 200 రోజులు ఆడిన గుంటూరు కారం.. మహేష్ ఖాతాలో మరో రేర్ రికార్డ్!