ఆస్పత్రిలో కన్నడ స్టార్.. ఒక్క వీడియోతో క్లారిటీ ఇచ్చిన నటుడు?
TeluguStop.com
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి మనకు సుపరిచితమే.కన్నడ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం కబ్జా సినిమా షూటింగ్లో ఈయన పాల్గొంటూ బిజీగా ఉండగా షూటింగ్ లొకేషన్లో కాస్త అస్వస్థతకు గురి కావడంతో ఈయనని చిత్ర బృందం సరైన చికిత్స నిమిత్తం బెంగళూరులోని నేలమంగళలోని హర్ష ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు.
షూటింగ్ లొకేషన్లో ఉండగా ఈయనకు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తగా చిత్ర బృందం తనని హాస్పిటల్ కి తీసుకెళ్లారు.
దీంతో ఉపేంద్ర హాస్పిటల్ లో చేరారని తెలియగానే ఒక్కసారిగా అభిమానులు ఆందోళన చెందారు.
ఈ విధంగా ఈయన ఆసుపత్రికి చేరడంతో ఈయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయం గురించి అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇకపోతే షూటింగ్ లొకేషన్లో డస్ట్ ఎలర్జీ కారణంగా ఈ సమస్య తలెత్తిందని, ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలపడంతో ఒక్కసారిగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇలా ఈయన చికిత్స తీసుకున్న అనంతరం తిరిగి లొకేషన్ కి వెళ్లారు. """/"/
ఇకపోతే ఈయన అభిమానులు తన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఉపేంద్ర సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ తాను క్షేమంగా ఉన్నానని, ప్రస్తుతం షూటింగ్ లొకేషన్లోనే తాను ఉన్నాను.
ఎవరు కూడా తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దు తాను క్షేమంగా ఉన్నానంటూ ఒక వీడియో ద్వారా తన ఆరోగ్య పరిస్థితి పై అభిమానులకు క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
విరాట్ కోహ్లీ సెంచరీ చూడటానికి పెళ్లిని సైతం ఆపేసిన వధూవరులు.. వీడియో వైరల్..