కన్నడిగులు నిద్ర లేచారు.. హీరోయిన్స్ ని పరిగెత్తిస్తున్నారు !!

కన్నడ ప్రేక్షకులు నిద్ర లేచారు.దేశ వ్యాప్తంగా వారి సినిమాలు సూపర్ హిట్ అయ్యి అందరు ఆ బాషా మూలలను గౌరవిస్తుంటే వారిలో వారికే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అని చెప్పవచ్చు.

కన్నడ సినిమా పేరు చెప్పి అక్కడ ఫెమ్ అవ్వాలంటే ఇప్పుడు ఉన్న కన్నడిగులు ఒప్పుకోరు.

మునుపెప్పుడు లేనంతగా కన్నడ రాష్ట్రం మొత్తం మేల్కొంది.ఎక్సట్రాలు చేస్తే తోలు తీస్తాం అన్నట్టుగా తయారయ్యారు అక్కడి వారు.

అయితే ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు అంటే ప్రస్తుతం కన్నడిగులు రష్మిక మరియు పూజ హెగ్డే లు వారి చేతిలో దారుణంగా ట్రోల్ అవుతున్నారు కాబట్టి.

మరి ఈ ఇద్దరు హీరోయిన్స్ ఎందుకు కన్నడ వాళ్ళ నోట్లో పడ్డారో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మొదట రష్మిక విషయానికి వస్తే రిషబ్ శెట్టి తో వెటకారం తో కూడా వ్యవహారం ఉండనే ఉందిగా.

ఈ సంఘటన జరిగిన తర్వాత ఆమె పైన ఇండస్ట్రీ మొత్తం గుర్రుమంటుంది.ప్రస్తుతం ఆమె చేతిలో రెండు కన్నడ సినిమాలు ఉన్నాయ్.

దాంతో నిర్మాతలు ఒత్తిడి చేసారో లేదంటే లేటు గా మేల్కొందో తెలియదు కానీ రష్మిక ప్రస్తుతం తప్పు దిద్దుకునే ప్రయత్నం చేస్తుంది.

తాను కన్నడ అమ్మాయినే అని తనకు రిషబ్ శెట్టి అండ్ గ్యాంగ్ కి ఎలాంటి గొడవలు లేవని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది.

పైగా కాంతారా సినిమా విజయం సాధించిన తర్వాత రిషబ్ శెట్టి కి తాను స్వయంగా కంగ్రాట్స్ చెప్తూ మెస్సేజ్ చేసానని అదంతా కూడా తాను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదంటూ ఫైర్ అవుతుంది.

"""/"/ చాల్లే ఇక పక్కకు వెళ్లు అన్నట్టుగా రష్మిక ను ఎవరు పట్టించుకోని ఈ టైం లో అందరి కళ్ళు ప్రస్తుతం పూజ హెగ్డే పైన పడింది.

ఎందుకంటే అడిగిన అడగకపోయినా పూజ తాను కన్నడ పరిశ్రమకు చెందిన దాన్ని అంటూ చెప్పుకోస్తోంది.

చిన్నతనం నుంచి భూతకోలా వంటి ఆచారాలను తాను కళ్లారా చూశానని చెప్తుంది.అయితే కన్నడ ఒక్క ముక్క కూడా మాట్లాడలేని పూజ హెగ్డే కి కన్నడ బాషా తో సంబంధం ఏంటి అంటూ అక్కడ ఆమెపై బాగా ట్రోలింగ్ జరుగుతుంది.

పైగా సల్మాన్ ఖాన్ తో సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాక ఆమెపై మరింత వ్యతిరేఖత కనిపిస్తుంది.

రష్మిక కు ఏమాత్రం తీసిపోవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు.

ఆ దర్గాకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.. రామ్ చరణ్ కామెంట్స్ వైరల్!