కన్నడ సినిమా సత్తా చాటుతుంది .. సరిహద్దులను చెరిపేస్తుంది

ఈ మధ్య బాలీవుడ్ సినిమాలను( Bollywood Movies ) దాటి మన సౌత్ సినిమాలు హిట్స్ బాట పడుతుంటే మనలో ఏదో కొత్తదనం, అంతకుమించిన క్రియేటివిటీ ఎక్కువగా ఉందని అర్థం, మరీ ముఖ్యంగా తమిళ, మలయాళ డైరెక్టర్స్ ఎప్పుడైనా సరే కథను కథలాగే తీస్తారు.

వారికి హీరోయిజం అనే ఒక కాన్సెప్ట్ ఎప్పుడూ ఉండదు.కథను చాలా చక్కగా ప్రజెంట్ చేస్తారు .

అందుకే భిన్నమైన ప్రయోగాత్మక కథలు వస్తున్నాయి.అంతేకాదు అక్కడ హీరోయిన్స్ కి కూడా నటనలో మంచి ప్రావీణ్యం ఉంటుంది అని అందరూ నమ్ముతారు.

మరి ముఖ్యంగా మలయాళ హీరోయిన్స్( Malayalam Heroines ) అయితే ఇరగదీస్తారని కూడా అందరికీ ఒక అంచనా ఉంటుంది.

అందం అనే విషయాన్ని పక్కన పెడితే వారి మొహాలలో హావభావాలు చాలా చక్కగా పలుకుతాయని అందరూ అనుకుంటూ ఉంటారు.

అందులో నిజమైతే పక్కా ఉంటుంది. """/" / ఇక సౌత్ ఇండియాలో చాలా తక్కువ బడ్జెట్లో సినిమాలు తీస్తారు అనే ఒక విశ్వాసం కూడా ఉంటుంది అయితే తమిళ మలయాళ చిత్రాలు మాత్రమే కాదు ఈ మధ్య కన్నడ సినిమా బాగా పుంజుకుంది అనేది మరొక వాస్తవం.

ఈ మధ్యకాలంలో కేజిఎఫ్, కాంతారా, చార్లీ ( KGF, Kantara, Charlie )వంటి కొన్ని సినిమాలు కోలీవుడ్ కి, మాలివుడ్ కి దీటుగా తమ పరిధిని పెంచుకొని ఆశలను సజీవంగా ఉంచుకున్నాయి.

ఇక ఈమధ్య రక్షిత్ శెట్టి ( Rakshit Shetty )మరో సినిమాతో సౌత్ ఇండియా పై తన ప్రభావాన్ని చూపించాడు.

చార్లీ సినిమాలో తను నటించిన విధానం కానీ, తనలోని నటుడిని బయటకు తీసిన విధానం చాలా బాగుంది.

ఆ సినిమానే కన్నడ సినిమా ఇండస్ట్రీని ప్రపంచానికి ఒకరకంగా పరిచయం చేసిందని చెప్పుకోవచ్చు.

"""/" / ఇక కేజీఎఫ్ ద్వారా యష్ స్టార్ట్ అయిన విషయం మనకు తెలిసిండే.

రిషబ్ శెట్టి కూడా కాంతార తో ఎంతో బాగా గుర్తింపు పొందాడు.ప్రస్తుతం కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ ఇండియా వ్యాప్తంగా అందరూ దృష్టి ఆకర్షించాడు.

మన తెలుగు సీరియల్ ఇండస్ట్రీ ని కన్నడ బామలు ఎప్పటినుంచో ఏలుతున్నారు.ఇప్పుడు ప్రస్తుతం టాప్ టెన్ హీరోయిన్స్ అంతా కూడా కన్నడ వారే కావడం విశేషం.

అంతెందుకు మన శ్రీలీల రష్మిక అందరూ కన్నడ వారే.ఇక ఇప్పుడు రిషబ్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి అనే సినిమా ద్వారా రక్షిత్ మల్లి ప్రయోగం చేసి కచ్చితంగా హిట్ అయితే అందుకున్నాడు.

ఈ సినిమా తర్వాత మళ్లీ అందరూ కన్నడ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నారు.

నిజం చెప్పాలంటే కన్నడ సినిమా ప్రస్తుతం తన సరిహద్దులను దాటి ఉనికిని చాటుకునే ప్రయత్నం గట్టిగానే చేస్తుంది.

అక్కడ సినిమాల బిజినెస్ పెరుగుతుంది.నిర్మాణ వ్యయంపెరుగుతుంది.

క్వాలిటీ కూడా పెరుగుతుంది.

ఇడ్లీ, సాంబార్ ట్రై చేసిన రష్యన్ యువతి.. ఆమె రియాక్షన్ ఇదే..?