కన్నడ హీరోలకు సాధ్యమయ్యే పనేనా?.. అందరూ రాకీ భాయ్‌లు కాలేరుగా

కన్నడ హీరోలకు సాధ్యమయ్యే పనేనా? అందరూ రాకీ భాయ్‌లు కాలేరుగా

సాధారణంగా మాతృభాషలో ఎంతో మంచి హిట్ సినిమాలలో నటించిన తర్వాత చాలామంది హీరోలు పర భాషలో కూడా నటించి అక్కడ కూడా తమకు మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలని భావిస్తారు.

కన్నడ హీరోలకు సాధ్యమయ్యే పనేనా? అందరూ రాకీ భాయ్‌లు కాలేరుగా

అయితే ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాల హవా పెరగడంతో ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు విడుదలవుతూ ప్రతి భాషలోనూ హీరోలు తమకు మార్కెట్ పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు.

కన్నడ హీరోలకు సాధ్యమయ్యే పనేనా? అందరూ రాకీ భాయ్‌లు కాలేరుగా

ఇకపోతే గత కొన్ని సంవత్సరాల నుంచి దక్షిణాది సినీ ఇండస్ట్రీలో కన్నడ తమిళ మలయాళ హీరోలు తెలుగు మార్కెట్ పై పెద్ద ఎత్తున ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.

"""/" / ఇప్పటికే రజనీకాంత్ కమల్ హాసన్ మమ్ముట్టి మోహన్ లాల్ సురేష్, గోపి వంటి ఎంతోమంది ఇతర భాష హీరోలు తెలుగులో వారి సినిమాలను డబ్ చేసి విడుదల చేయడమే కాకుండా నేరుగా తెలుగు సినిమాలలో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే మధ్యలో ఇతర భాష హీరోలు తెలుగులో నటించకపోయిన ప్రస్తుతం మరోసారి కన్నడ హీరోలు తెలుగులో కూడా పాగా వేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కే జి ఎఫ్ సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన యష్ తెలుగులో కూడా తన మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

"""/" / ఇక ఈగ సైరా నరసింహారెడ్డి రక్త చరిత్ర వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను సందడి చేసిన సుదీప్ సైతం తాను నటిస్తున్న సినిమాలను తెలుగులో విడుదల చేస్తూ తెలుగులో మార్కెట్ పొందడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక రక్షిత శెట్టి కూడా తాను నటించిన 777 చార్లీ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు.

ధ్రువ సర్జా కూడా పొగరు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా ఈ కన్నడ హీరోలు అందరూ తెలుగులో తమ సినిమాలను విడుదల చేసి ఇక్కడ కూడా మంచి మార్కెట్ పెంచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ఇది అంత సాధ్యమయ్యే పని కాదని, ప్రతి ఒక్కరూ కూడా యష్ మాదిరిగా హిట్ కొట్టాలంటే సాధ్యమయ్యే పని కాదని మరికొందరు భావిస్తున్నారు.

కన్నప్ప లో ఒకప్పటి మోహన్ బాబు కనిపిస్తాడా..?