సీనియర్స్ నుంచి జూనియర్స్ వరకు కొనసాగుతున్న కన్నడ హీరోయిన్స్ హవా

సాధారణంగా కన్నడ హీరోయిన్ల హవా ఇండియన్ సినిమా పరిశ్రమపై ఎక్కువగా ఉంటుంది.కేవలం తెలుగులోనే కాదు, బాలీవుడ్ లో సైతం ప్రస్తుతం వారి హవానే ఉందంటే అతిశయొక్తి కాదు.

గతంలో ఐశ్వర్యారాయ్ శిల్పా శెట్టి వంటి వారు సత్తా చాటగా ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి నుంచి రష్మిక పూజా హెగ్డే స్త్రీల శ్రీనిధి ఇలా అందరూ కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారే కావడం విశేషం.

సీనియర్లు అనే తేడా లేకుండా ప్రతి హీరోయిన్ కూడా మంగుళూరు నుంచి ఇంపోర్ట్ అవుతున్నారు.

చలో సినిమాతో రష్మిక హీరోయిన్ గా ఇండస్ట్రీలో పరిచయం అవ్వగా గీతగోవిందంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

ఆ తర్వాత పుష్ప వంటి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగి ప్రస్తుతం బాలీవుడ్ లో ఐదు సినిమాలకు సంతకం చేసి సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది.

ఇక పొడుగు కాళ్ళ సుందరి పూజ హెగ్డే సైతం కన్నడ బామ కావడం విశేషం.

ఒక లైలా కోసం అంటూ తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన పూజ తన అందంతో అభినయంతో మరిన్ని సినిమాలు దక్కించుకుంది.

ముకుంద, దువ్వాడ జగన్నాథం సినిమాలు ఫ్లాప్ అయినప్పటికి ఆమెకి టాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి.

అరవింద సమేత, మహర్షి, అలా వైకుంఠపురం లో సినిమాలతో సక్సెస్ కి చిరునామాగా మారిపోయింది పూజా హెగ్డే.

మొహంజదారో అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన, మళ్లీ బాలీవుడ్ లో బిజీ అవుతుంది.

"""/" / ఇక కేజిఎఫ్ బామ శ్రీనిధి శెట్టి సైతం కన్నడ ఇండస్ట్రీలో తొలిత తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

2017లో మిస్ కన్నడ టైటిల్ గెలిచిన శ్రీనిధి 2016 లో సూపర్ దివ నేషనల్ గా ఎంపికైంది.

కే జి ఎఫ్ సినిమాలు శ్రీనిధికి మంచి పేరు తీసుకురాగా హీరో విక్రమ్ తో కోబ్రా సినిమాలో నటిస్తూ మరోసారి పాన్ ఇండియా చిత్రంలో మెరవనుంది.

మరొక కన్నడ హీరోయిన్ కృతి శెట్టి సైతం మొదట సూపర్ 30 సినిమా లో చిన్న రోల్ లో నటించి ఆ తర్వాత ఉప్పెన సినిమాతో తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారింది నానితో శ్యామ్ సింగరాయ్, చైతు తో బంగార్రాజు సినిమాలు చేసి సూపర్ హిట్ హీరోయిన్ గా తెలుగులో పాగా వేసింది ప్రస్తుతం నితిన్ తో ఒక సినిమా, సూర్యతో మరొక సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉంటుంది.

పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీల సైతం తొలుత కన్నడ ఇండస్ట్రీలోనే ఎంట్రీ ఇచ్చి బెస్ట్ ఫిమేల్ డబ్ల్యూ యాక్టర్ గా సైమా అవార్డు సైతం గెలుచుకుంది.

రవితేజ సినిమాలో అలాగే, నవీన్ పోలిశెట్టి సరసన ఒక సినిమాలో నటిస్తోంది ఇక వైష్ణవ తేజ్ తో సైతం నటించే అవకాశం సైతం దక్కించుకుంది.

ఇక వీళ్ళే కాదు, నభ నటేష్, శ్రద్ధ శ్రీనాథ్ వంటి కన్నడ హీరోయిన్స్ తెలుగులో ప్రస్తుతం సత్తా చాటుతున్నారు.

రాజీనామా చేయించే ఆలోచనలో కాంగ్రెస్ .. ‘ దానం ‘ ఒప్పుకుంటారా ?