పుష్ప 2 పోస్టర్ పై కన్నడ ప్రేక్షకుల ట్రోల్స్
TeluguStop.com
అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో ప్రస్తుతం పుష్ప 2( Pushpa 2 ) చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.
సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు(Allu Arjun Birthday ) సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ను మరియు పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది.
పుష్ప ఎక్కడ అంటూ వీడియో సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది.ఇక పోస్టర్ లో అర్ధ నారీశ్వరుడిగా కనిపించిన అల్లు అర్జున్ సర్ప్రైజ్ చేశాడు.
ఆ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.కొందరు ఆ పోస్టర్ ని ఆహా ఓహో అంటూ ప్రశంసలు కురిపిస్తుంటే మరి కొందరు మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు.
ముఖ్యంగా కన్నడ సినీ ప్రేక్షకులు తమ కాంతార సినిమా ను కాపీ కొట్టారు అంటూ విమర్శలు చేస్తున్నారు.
మరి ఇంత చీప్ కాఫీ అవసరమా అంటూ వారు విమర్శలు చేస్తున్నారు.కాంతార( Kantara ) కాపీ చేసి వారు ఈ పోస్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అంటున్నారు.
కేవలం పోస్టర్ వరకేనా సినిమా మొత్తాన్ని కూడా కాపీ కొట్టారా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
"""/" /
మొత్తానికి పుష్ప చిత్రం యొక్క హడావుడి మామూలుగా లేదు.ప్రశంసలు కురిపించే వారు ప్రశంసలు కురిపిస్తున్నారు.
విమర్శలు చేసేవారు విమర్శిస్తున్నారు.ఏదో విధంగా అయితే సినిమా వార్తల్లో నిలుస్తుంది.
కనుక ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. """/" /
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ అందరికీ షాక్ గా ఉంది.
మొదట 400 కోట్ల రూపాయలను అనుకున్నారు, ఇప్పుడు ఆ బడ్జెట్ రూ.500 కోట్ల వరకు పెరిగిందట.
బాలీవుడ్( Bollywood ) లో పుష్ప 2 సినిమా 300 కోట్ల రూపాయలను ప్రీ రిలీజ్ బిజినెస్ చేయాల్సిన అవసరం ఉంది.
మొత్తంగా రూ.600 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
రూ.1000 కోట్ల టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప ఇలాంటి టోల్స్ ఎన్ని వచ్చినా కూడా తగ్గేదేలే అంటున్నారు.
ప్రెగ్నెన్సీ సమయంలో నా గొంతు పోయింది.. సింగర్ ప్రణవి ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!