ఆస్పత్రిలో చేరిన పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివన్న.. ఆ రీజన్ వల్లే చేరారంటూ?
TeluguStop.com
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్( Shiva Rajkumar ) గురించి మనందరికీ తెలిసిందే.
ఇతను దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్( Puneeth Raj Kumar ) సోదరుడు అన్న విషయం కూడా తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు శివరాజ్ కుమార్.
ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఆయన అనారోగ్యానికి కూడా తెలుస్తోంది.తాజాగా సోమవారం బెంగళూరు లోని ( Bengaluru ) ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.
"""/" /
అయితే శివరాజ్ కుమార్ ఎందుకు ఆస్పత్రిలో చేరారో ఇంకా కచ్చితమైన కారణాలు తెలియలేదు.
ఆయనను చూసేందుకు మధు బంగారప్ప ఆస్పత్రికి వెళ్లారు.దీంతో శివన్న ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
అయితే డాక్టర్లు తెలిపిన వివరాల మేరకు.శివరాజ్ కుమార్ కు ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేవని తెలుస్తోంది.
కేవలం జనరల్ చకప్( General Checkup ) కోసమే ఆయన ఆసుపత్రికి వచ్చినట్లు సమాచారం.
మంగళవారం.ఉదయం శివన్న డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా శివరాజ్ కుమార్ చాలా బిజీగా ఉన్నారు.
ఒకవైపు సినిమా పనులు.మరొకటి లోక్‌సభ ఎన్నికల ప్రచారం.
"""/" /
శివరాజ్‌కుమార్ భార్య గీత ఈసారి షిమోగా లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
అందుకే తన భార్య తరపున ప్రచారం చేసేందుకు పలు పట్టణాల్లో పర్యటిస్తున్నాడు శివన్న.
అయితే ఇప్పటికే తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ మరణించడంతో ఆ విషయాన్ని తట్టుకోలేకపోతున్నా అభిమానులు అన్నయ్య శివరాజ్ కి ఏమైనా అయితే తట్టుకోలేము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రైలులోని అమ్మాయిలపై నీళ్లు చల్లిన యువకుడు.. వీపు పగిలేలా కొట్టిన పోలీస్ (వీడియో)