కన్నడ నటుడు దివంగత పునీత్ రాజకుమార్ భారీ ఫైబర్ క్లాస్ విగ్రహాం

కళకేది కాదు అనర్హం అనుకున్నారో ఏమో ఈ శిల్పులు వచ్చిన అవకాశాన్నల్లా అందిపుచ్చుకొని తమ కళా నైపుణ్యానికి మెరుగులు దిద్దుతున్నారు.

గుంటూరు జిల్లా తెనాలి సూర్య శిల్పశాలకు చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు మరియు అతని కుమారులు గత కొంతకాలంగా వివిధ రకాల శిల్పాలను జీవ కల ఉట్టిపడేలా తయారు చేసి అందరి మన్ననలు పొందుతున్నారు.

అయితే శిల్పకళలో కొత్తగా వచ్చిన త్రీడీ టెక్నాలజీని సైతం అందిపుచ్చుకొని కన్నడ పవర్ స్టార్ దివంగత పునీత్ రాజకుమార్ భారీ ఫైబర్ క్లాస్ విగ్రహాన్ని కాటూరి శ్రీహర్ష రూపొందించారు.

బెంగళూరుకు తరలించడం ఉన్న ఈ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే అన్నాబతులకు శివకుమార్ తిలకించి శిల్పకారులను అభినందించారు.

ఈ సందర్భంగా త్రీడీ టెక్నాలజీతో చేసిన డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి మినియేచర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే శివకుమార్కు శిల్పకారులు బహుకరించారు.

జనసేన లోకి వారంతా క్యూ … టీడీపీ నేతల్లో ఆగ్రహం ?