పార్టీలో ఇమడలేకనే రాజీనామా.. కన్నా లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

ఏపీ బీజేపీలో కీలక నేతగా వ్యవహరించిన కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేశారు.

కన్నాతో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీని వీడినట్లు అధికారికంగా ప్రకటించారు.2014 సంవత్సరంలో మోదీ నాయకత్వంపై విశ్వాసంతో బీజేపీలో చేరినట్లు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

2018 లో తనకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారన్నారు.తన పని తీరు నచ్చి పలువురు మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు పార్టీలో చేరారని తెలిపారు.

కానీ సోమువీర్రాజు అధ్యక్షుడు అయినప్పటి నుంచి పార్టీలో పరిస్థితులు బాగాలేవని ఆరోపించారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం పార్టీలో చోటుచేసుకున్న పరిస్థితులకు ఇమడలేక బీజేపీకి రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు.

తన భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని స్పష్టం చేశారు.

శుక్రవారం ఆ పనులు అసలు చేయను..జాన్వీ కపూర్ కి ఇలాంటి సెంటిమెంట్స్ ఉన్నాయా?