టీడీపీ శాశనసభాపక్షం బీజేపీలో విలీనం అవుతుంది అంటున్న కన్నా లక్ష్మినారాయణ

ఏపీలో బీజేపీ పార్టీ టీడీపీ నేతలే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించింది.టీడీపీ పార్టీలో ఉన్న నేతలని, బుజ్జగించి లేదంటే బెదిరించి, భయపెట్టి పార్టీలోకి లాక్కుంటుంది.

ఇప్పటికే టీడీపీ రాజ్యసభ సభ్యులుని బీజేపీలో చేర్చుకున్న ఆ పార్టీ నేతలు రానున్న రోజుల్లో చాలా మంది టీడీపీ నేతలు బీజేపీలో చేరబోతున్నారు అని చెబుతున్నారు.

ఇక బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అయితే రెండు ఆకులు ఎక్కువే చదివి టీడీపీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది త్వరలో బీజేపీ కండువా కప్పుకుంటారని, ఇక టీడీపీ శాశనసభాపక్షం కూడా బీజేపీలో విలీనం అయిపోతుంది అని హాట్ కామెంట్స్ చేసారు.

రానున్న రోజుల్లో టీడీపీ ఎవరు ఉండరని ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్న కీలక నేతలంతా కాషాయం కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

అయితే త్వరలో పార్టీలో చేరబోయే ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎవరు అనే విషయం మాత్రం కన్నా చెప్పలేదు.

ఇటీవ‌లే తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై కూడా ఆయ‌న స్పందించారు.

మోడీకి చంద్ర‌బాబు నాయుడుతో ఎలాంటి అవ‌స‌రాలు ఉండ‌వ‌ని క‌న్నా అన్నారు.టీడీపీ పార్టీని బీజేపీలో విలీనం చేసుకోవాల్సినంత అవసరం అయితే లేదని చెప్పుకొచ్చారు.

అయితే రానున్న రోజుల్లో టీడీపీ భూస్థాపితం అయిపోయి బీజేపీ ప్రధాన పార్టీగా ఏపీలో అవతరించబోతుంది అని కన్నా చెప్పుకొచ్చారు.

అయితే కన్నా ఆశలకి ఏపీ ప్రజలు ఎంత వరకు ఊపిరి పోస్తారు అనేది ఇప్పుడు వేచి చూడాలి.