జనసేన లోకి ‘ కన్నా’ ? ఆ సీటు కన్ఫార్మ్? 

సీనియర్ పొలిటిషన్ ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ అడుగులపై ఒక క్లారిటీ వచ్చేసింది.

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఒక వెలుగు వెలిగిన లక్ష్మీనారాయణ ఆ పదవి కోల్పోయిన తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించారు.

ఇక అప్పటి నుంచి కన్నా తీవ్ర అసంతృప్తితోనే ఉంటున్నారు.తనకు, తన వర్గానికి ప్రాధాన్యం పెరగకుండా సోము వీర్రాజు వ్యవహరిస్తుండడంపై కన్నా చాలాకాలం నుంచి తీవ్ర అసంతృప్తితోనే బిజెపి లో సైలంట్ గా ఉంటున్నారు.

అయితే పార్టీ మారే విషయంలోనే ఆయన చాలాకాలంగా ఆలోచన చేస్తున్నారు.కేంద్ర అధికార పార్టీగా ఉన్న బిజెపి నుంచి తప్పుకోవడం సరైన కాదని ఆలోచనతో చాలాకాలంగా వేచి ఉంటున్నారు.

అయితే ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ రాజకీయంగా నిర్ణయం తీసుకున్నారు.

"""/"/ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళబోతూ ఉండడం తో ఆ కాంబినేషన్ లో తప్పకుండా అధికారంలోకి ఆ కూటమి వస్తుందని భావిస్తున్న లక్ష్మీనారాయణ జనసేన లో చేరడమే సరైన నిర్ణయంగా భావిస్తున్నారట.

ఈ మేరకు ఈనెల 26వ తేదీన  జనసేన లో అధికారికంగా చేరబోతున్నట్లు సమాచారం.

జనసేన నుంచి సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం.

"""/"/ గత కొంతకాలంగా పవన్ ను జనసేన ను టార్గెట్ చేసుకుని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో,  ఆయనను ఓడించేందుకు సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ రంగంలోకి దింపితే ఫలితం సాంకూలంగా ఉంటుందని పవన్ భావిస్తున్నారట.

ఇప్పటికే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కన్నా లక్ష్మీనారాయణ నివాసం కి వెళ్లి మంతనాలు చేసిన సంగతి తెలిసిందే.

ఇక తాను జనసేనలో చేరితే తనకు దక్కబోయే ప్రాధాన్యం, సీటు విషయంలో కన్నా లక్ష్మీనారాయణ ముందుగానే క్లారిటీ తీసుకుని ఆ పార్టీలో చేరేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం.

Kodali Nani : ఇళ్ల పట్టాల విషయంలో టీడీపీపై కొడాలి నాని సీరియస్ వ్యాఖ్యలు..!!