కంగువా సినిమాలో ఏఐతో డబ్బింగ్.. ఈ ప్రయోగం వల్ల లాభమా? నష్టమా?

తమిళ హీరో సూర్య( Surya ) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కంగువ( Kanguva ).

శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాను స్టూడియో గ్రీన్ యూవీ క్రియేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఫాంటసీ యాక్షన్ ఫిలిం గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

ఈ సినిమా షూటింగ్ ని వీలైనంత తొందరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు మూవీ మేకర్.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా గురించి కేఈ జ్ఞానవేల్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

"""/" / తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో నెటిజన్స్ తో ముచ్చటించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్‌ చెప్పగా.మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్‌ పనులు పూర్తిచేయనున్నాము.

డబ్బింగ్‌ పనుల కోసం కోలీవుడ్‌ లో ఏఐని ఉపయోగించడం ఇదే తొలిసారి.ఇటీవల విడుదలైన వేట్టయన్‌ లో అమితాబ్‌ బచ్చన్‌ వాయిస్‌ లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించారు.

ఇప్పుడు పూర్తిగా డబ్బింగ్‌ కోసం మేం దీన్ని ప్రయోగిస్తున్నాము.ఇది విజయవంతమవుతుందని భావిస్తున్నాము.

"""/" / ఈ చిత్రం అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌ ( English, French, Spanish )లలో కూడా విడుదల కానుంది.

చైనీస్‌, జపనీస్‌ విడుదల తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తాము అని నిర్మాత జ్ఞానవేల్‌ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల కలెక్షన్స్‌ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు నిర్మాత ఇటీవల తెలిపారు.

పార్ట్ 2, పార్ట్‌ 3 కథలు సిద్ధంగా ఉన్నాయని, పార్ట్‌ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు.

ఈ సినిమా సూర్యని మరో స్థాయికి తీసుకెళ్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు.యాక్షన్‌తో పాటు ఎమోషన్స్‌ కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉందని అన్నారు.

త్రీడీలోనూ అలరించనున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.కంగ అనే ఒక పరాక్రముడి కథతో ఈ సినిమా సిద్ధమవుతున్నట్లు సమాచారం.

జలుబు చేసిందా.. వంటింట్లో ఉండే మెంతులతో తరిమి కొట్టండిలా!