‘కంగువ’ అవైటెడ్ గ్లింప్స్ కు టైం ఫిక్స్.. సూర్య మరో క్రేజీ పోస్టర్ రిలీజ్!

కోలీవుడ్ హీరోల్లో సూర్య( Surya ) ఒకరు.ఈయనకు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందొ చెప్పాల్సిన పని లేదు.

కోలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు సూర్య యాక్టింగ్ అంటే ఎంతో మందికి ఇష్టం.

అందుకే ఈయన సినిమాల కోసం ఎదురు చూస్తుంటారు.అందులోను సూర్య ఎప్పుడు కూడా కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు.

మరి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు సూర్య.ప్రస్తుతం సూర్య డైరెక్టర్ శివ దర్శకత్వంలో ''కంగువ'' ( Kanguva )సినిమాను చేస్తున్నాడు.

ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది.కంగువ సినిమా మీద కూడా భారీ హైప్ పెరిగింది.

ఇక ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు రేపు అదిరిపోయే అప్డేట్ రాబోతుంది అని మేకర్స్ మొన్ననే తెలిపారు.

"""/" / ఈ సినిమా నుండి ఫస్ట్ టీజర్ గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నారు.

ఇదే అప్డేట్ ను మేకర్స్ మొన్న సరికొత్త పోస్టర్ తో అనౌన్స్ చేసారు.

జులై 23న సూర్య బర్త్ డే( Surya Birthday ) కానుకగా ఈ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

ఇక ఈ రోజు మళ్ళీ ఈ గ్లింప్స్ గురించి సమాచారం అందించారు.రేపు 12 గంటల 1 నిముషానికి లాంచ్ చేస్తున్నట్టుగా తెలిపారు.

దీంతో పాటు మరో సరికొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ లో ఈసారి సూర్య లుక్ కాస్త రివీల్ చేసారు.

"""/" / మరి ఈ గ్లింప్స్ ఎలా ఉంటుందో చూడాలి.ఇక ఈ సినిమా ఇప్పటికే 50 శాతానికి పైగానే షూటింగ్ పూర్తి చేసుకుంది.

గ్రాండ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

యూవీ క్రియేషన్స్ అండ్ గ్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 10 భాషల్లో రిలీజ్ కానున్నట్టు టాక్.

కాగా ఈ సినిమాలో సూర్యకు జోడీగా దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ పై ఎమోషనల్ కామెంట్స్ చేసిన చిరు… ఇద్దరూ అంటూ?