జయలలిత బయోపిక్ లో స్మార్ట్ యాక్టర్

అందమైన వివాదాల సుందరి కంగనా రనౌత్ నెక్స్ట్ జయలలిత బయోపిక్ తో రాబోతోంది.

కోలీవుడ్ దర్శకుడు ఏఎల్.విజయ్ తెరకెక్కిస్తున్న స సినిమాలో అమ్మడు మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనుంది.

జయలలిత జీవితానికి సంబంధించి మరో మూడు ప్రాజెక్టులు సిద్దమవుతున్నప్పటికీ అందరి చూపు ఎక్కువగా కంగనా నటిస్తున్న సినిమాపైనే ఉంది.

"""/"/ అసలు విషయంలోకి వస్తే.ఈ బయోపిక్ లో ఒక ముఖ్య పాత్ర కోసం సీనియర్ యాక్టర్ అరవింద్ స్వామిని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

అలనాటి తమిళ నటుడు మాజీ ముఖ్యమంత్రి ఎమ్.జి.

ఆర్ పాత్రలో ఈ స్మార్ట్ యాక్టర్ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.జయలలిత రాజకీయ జీవితంలో ఎమ్ జిఆర్ పాత్ర చాలా కీలకం.

ఆమె రాజకీయల్లో కోనసాగడానికి ఆయన ఆదర్శంగా నిలిచారు. """/"/ ఇకపోతే ముందుగా ఆ ప్రఖ్యాత వ్యక్తి పాత్ర కోసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని ఎంచుకోవాలని అనుకున్నారు.

కానీ కథలో అదే కీలకమైన పాత్ర కావడంతో అంచనాలు భారీగా ఉంటాయి.

అందుకే అరవింద్ స్వామిని ఎంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ బయోపిక్ కి కథను అందించారు.

ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఆ 3500 రూపాయలు నేనే అడిగాను.. వైరల్ అవుతున్న రేణూ దేశాయ్ కామెంట్స్!