కంగనా ఎలా అయిపోయిందో చూశారా.. కొద్దిరోజుల్లోనే ఎంత మార్పు?

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గురించి అందరికి పరిచయమే.తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

బాలీవుడ్ లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటులలో ఈమె కూడా ఉంది.తన నటనకు ఎన్నో అవార్డులను కూడా అందుకుంది.

గ్లామర్ విషయంలో కూడా మోడల్ గా మంచి పేరు సంపాదించుకుంది.ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ.

నిత్యం ఏదో ఒక ట్వీట్ తో హాట్ టాపిక్ గా మారుతుంది.2004 లో దీపక్ శివ దసని దర్శకత్వంలో 'ఐ లవ్ యు బాస్' అనే మూవీతో ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.

ఈ సినిమాతో మంచి గుర్తింపు అందుకొని ఆ తర్వాత వరుస సినిమాలలో నటించింది.

ఇక ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉన్న కంగనా.ఇటీవలే ఓ రియాలిటీ షోతో ఓటీటీ లో కూడా అడుగు పెట్టనున్నట్లు వార్తలు వినిపించాయి.

ఇదిలా ఉంటే కంగనా రనౌత్ లో తాజాగా చాలా మార్పులు వచ్చాయి.ఏ పాత్రకైనా సవాల్ విసురుతుంది కంగనా రనౌత్.

ప్రస్తుతం జయలలిత జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కనున్న 'తలైవి' సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో కంగనా కొన్ని సన్నివేశాలలో లావుగా కనిపించాల్సి ఉండగా.ఈ సినిమా కోసం తన శరీర బరువును పెంచుకొని మరి నటించింది.

మొత్తానికి ఈ సినిమా పూర్తికాగా.విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇక ప్రస్తుతం 'ధాకడ్' అనే సినిమాలో నటిస్తుంది. """/"/ ఇక ఈ సినిమాలో కంగనా ఫైటర్ గా కనిపించనుంది.

దీంతో ఈ పాత్ర కోసం తన శరీరాన్ని ఫిట్ గా, నాజూగ్గా ఉండటం కోసం.

అతి తక్కువ సమయంలో తన శరీర బరువుని తగ్గించుకుంది.ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా.

తాజాగా కంగనా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ ఫోటో పంచుకుంది.

అందులో తలైవి సినిమా సమయంలో తాను దిగిన ఫోటో, ప్రస్తుతం నటిస్తున్న ధాకడ్ సినిమా ఫోటో లుక్ ను షేర్ చేస్తూ.

'ఎవరూ చేయని ప్రయాణం ఇది' అని ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది.ఇక ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా తన సత్తాను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

అంబుడ్స్‌మన్‌ను తొలగించిన ట్రంప్ .. హెచ్ 1 బీ వీసాదారులు , విద్యార్ధులపై ఎఫెక్ట్