అఫిషియల్ : 'చంద్రముఖి 2'లో బాలీవుడ్ క్వీన్!

కోలీవుడ్ స్టార్ హీరోల్లో రజనీ కాంత్ ఒకరు.ఈయనకు టాలీవుడ్ లో మాత్రమే కాదు.

ఇండియా వైడ్ ఫాలోయింగ్ ఉంది.ఇక తమిళ నాడు లో అయినా ఈయన ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు.

ఈయన సినిమా అంటే ముందే నుండే భారీ క్రేజ్ ఉంటుంది.థియేటర్ ల దగ్గర ఫ్యాన్స్ సందడి మాములుగా ఉండదు.

ఈయన అంటే కేవలం సాధారణ ప్రేక్షకులకు మాత్రమే కాదు.సినీ సెలెబ్రెటీలకు కూడా గౌరవం ఉంది.

ఇక ఈయన కెరీర్ లో మరపురాని సినిమాలలో చంద్రముఖి ఒకటి.2005 లో రిలీజ్ అయినా ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

ఈ సినిమాను పి వాసు డైరెక్ట్ చేయగా.శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హీరో ప్రభు, రామ్ కుమార్ గణేషన్ కలిసి నిర్మించారు.

రజనీకాంత్ వరుసగా ప్లాపులు ఎదుర్కుంటున్న సమయంలో చంద్రముఖి వంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది.

"""/"/ ఇక అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ గా చంద్రముఖి 2 రాబోతుంది.

పి వాసు డైరెక్ట్ చేయబోతుండగా.లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

అయితే ఈసారి ఇందులో హీరో రజనీకాంత్ కాదు.రాఘవ లారెన్స్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.

ఎంతో గ్రాండ్ గా నిర్మించ బోతున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు అనేది అఫిషియల్ గా ప్రకటించారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ క్వీన్ కంగనా నటిస్తుంది అనే వార్త గత కొన్నాళ్లుగా వైరల్ అవుతూనే ఉంది.

కానీ ఈ రూమర్స్ పై ఇన్నాళ్ళుగా మేకర్స్ స్పందిస్తూ కొద్దిసేపటి క్రితం టీమ్ నుండి అఫిషియల్ ప్రకటన వచ్చింది.

ఇందులో కంగనా రనౌత్ హీరోయిన్ గా నటిస్తుంది అని కన్ఫర్మ్ చేసారు.చూడాలి ఈ సినిమా ఎలా అలరిస్తుందో.

బ్రిటిష్ వ్లాగర్లకు ఎక్కువ ఛార్జ్ చేద్దామనుకున్నాడు.. ఈ పెద్దాయన రంగంలోకి దిగడంతో…??