అలియా భట్ ను టార్గెట్ చేసిన కంగనా రనౌత్.. ఏం జరిగిందంటే?
TeluguStop.com
బాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాస్పద నటిగా నిత్యం ఏదో ఒక సంచలనమైన వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నటువంటి కాంట్రవర్సి క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
నిత్యం ఏదో ఒక వివాదం సృష్టిస్తూ ఉండే ఈమె తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ నటించినటువంటి ఒక వాణిజ్య ప్రకటన మీద కంగనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రస్థాయిలో మండిపడింది.
అసలు ఈమె ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే
హిందూ సాంప్రదాయాలలో ఎంతో ప్రధానమైనటువంటి కన్యాదానం అనే పదాన్ని అలియా భట్ కన్య మ్యాన్ అని పిలుపునివ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.
ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో దేశ సరిహద్దులో జవాను చనిపోతే ఆ అమరవీరుడి తండ్రి ఎవరో చింతించకండి మరొక బిడ్డను భరతమాత సేవకు దానం చేస్తానని చెబుతారు.
అలా కన్యాదానం పుత్ర దానం గురించి ఎంతో గొప్పగా చెప్పుకునే మాటలను ఎప్పుడైతే చిన్నచూపు చూస్తాము అప్పుడు రామ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైనది అని గుర్తించాలి హిందువులు హిందూ సంప్రదాయాలను కించపరచడం ఇకనైనా ఆపండి అంటూ ఈమె తీవ్రస్థాయిలో వ్యక్తం చేశారు.
"""/"/
కేవలం ఆలియాభట్ పై మాత్రమే కాకుండా ఈ వాణిజ్య ప్రకటన యాజమాన్యంపై కూడా కంగనా ఆగ్రహం వ్యక్తం చేశారు.
కులమతాలను రాజకీయాలను అడ్డుపెట్టుకొని తమ ప్రాజెక్టులను అమ్ముకోవాలన్న ఆలోచనను మానుకోవాలి అంటూ అన్ని బ్రాండ్ల యజమానులకు విజ్ఞప్తి చేస్తున్న అమాయకులైన ప్రజలను మీ మాయమాటలతో మోసం చేయడం ఆపండి అంటూ ఆమె అన్ని బ్రాండ్లు యాజమాన్యాలకు హెచ్చరించారు.
ఇలా సోషల్ మీడియా వేదికగా కంగనా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
మరో భారీ ప్రాజెక్టుకు చంద్రబాబు శ్రీకారం .. రాయలసీమకు పండుగే