ఆ అవార్డు గెలుచుకోవడం సంతోషంగా ఉందంటున్న కంగనా..!

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గురించి తెలియని వారెవ్వరూ ఉండరు.ఆమె నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని ముక్కుసూటి మనిషి గా ఓ పేరు తెచ్చుకుంది కంగనా.

ఆమె సినిమాలలో తన నటన పట్ల తెచ్చుకున్న గుర్తింపు కంటే.ఆమె సోషల్ మీడియాలోనే మరింత గుర్తింపు తెచ్చుకుంది.

కంగనా ఎప్పటికప్పుడు తన ట్విట్టర్ ఖాతాలో ఏదో ఒక విషయంపై కౌంటర్లు వేస్తూ వివాదాలో చిక్కుకుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా కంగనా జాతీయ అవార్డును గెలుచుకున్న సందర్భంగా కొన్ని విషయాలను తెలుగు సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

గత ఏడాది మే లో జరగాల్సిన జాతీయ అవార్డులు కరోనా వైరస్ సమయం వల్ల వాయిదా పడటంతో ఇటీవలే కేంద్రం అవార్డులను ప్రకటించింది.

ఇక ఈ అవార్డు పలు సినిమాలలో కంగనా చేసిన మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ, పంగా సినిమా కు ఈ అవార్డు అందింది.

ఇక ఈ అవార్డు అందుకున్న కంగనా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది.

ఆమె మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ కి దర్శకత్వం వహించానని, ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాసిన కేవీ విజయేంద్రప్రసాద్ సహా కృతజ్ఞతలు తెలిపింది.

ఈ సినిమాకు సంభాషణలు రాసిన ప్రసూన్ జోషి, సంగీత దర్శకుడు శంకర్- ఏహాన్-లాయ్, నిర్మాత కమల్ జైన్, సహనటులు అంకిత లోఖండే,డానీ డెంజోంగ్పా తదితరులు ఉన్నారు.

ఈ సినిమాను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలుతెలిపింది.ఇక పంగా సినిమా దర్శకుడు అశ్విని అయ్యర్ తివారీ, సినీ బృందం మొత్తానికి కృతజ్ఞతలు తెలిపింది కంగనా.

అంతేకాకుండా నేషనల్ అవార్డ్స్ జ్యూరీ తో పాటు అభిమానులు, కుటుంబ సభ్యులు, తన వ్యక్తిగత సిబ్బంది కూడా కృతజ్ఞతలు తెలిపింది కంగనా.

ఓటు వేయని జ్యోతిక… ఏకిపారేసిన నటి కస్తూరి శంకర్?