హైదరాబాద్ చేరిన కంగనా కారణమేంటంటే?
TeluguStop.com
సుశాంత్ సింగ్ రాజపుత్ చనిపోయినప్పటి నుండి కంగనా రనౌత్ ప్రతిరోజు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే, మహారాష్ట్ర సీఎం ఠాక్రే తో గొడవ కారణంగా తన ఆఫీస్ ను కూడా కోల్పోయిన కంగనా ముంబై ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చింది.
దీనిపై పెద్ద రభస జరిగిన విషయం అందరికీ విదితమే.ఈ గొడవల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆమెకు Z కేటగిరీ భద్రతను కల్పిచింది, ఇంత హడావుడికి కారణమైన కంగనా తాజాగా హైదరాబాద్ లో అడుగు పెట్టింది, తను హైదరాబాద్ రావడానికి కారణమేంటి అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తలైవి లో కంగనా నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.
ఈ కారణంగా కంగనా ట్విట్టర్ లో ఏడు నెలల తరువాత సౌత్ ఇండియా వెళ్తున్నాను అని పోస్ట్ చేసింది.
చాలా కాలం తర్వాత షూటింగ్ లో పాల్గొన్న కంగనా తనకు ప్రజలందరి ఆశీర్వాదం కావాలని కోరింది.
తలైవిని వచ్చే ఏడాది ఆరంభంలో తమిళం తో పాటు తెలుగు, హిందీ భాషల్లో భారీ ఎత్తున్న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒకే ఇంట్లో నలుగురు భవిష్యత్ డాక్టర్లు.. ఈ విద్యార్థుల తండ్రి కష్టం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!