మహారాష్ట్ర ప్రభుత్వం పై మరోసారి సీరియస్ కామెంట్స్ చేసిన కంగనారనౌత్..!!
TeluguStop.com

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్.గతంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై కాంట్రవర్సీ కామెంట్ చేయటం తెలిసిందే.


ఈ క్రమంలో ఆ సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది.


పరిస్థితి ఇలా ఉంటే.మహారాష్ట్రలో థియేటర్లను ఓపెన్ చేయడానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడం పట్ల కంగనా మరోసారి సీరియస్ అయింది.
దేశంలో కరోనా.తగ్గుముఖం పట్టిన కానీ రాష్ట్రంలో థియేటర్లను ఎందుకు ఓపెన్ చేయటం లేదని.
మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.ఉద్దేశపూర్వకంగా మహారాష్ట్ర ప్రభుత్వం థియేటర్లు ఓపెన్ చేయటం లేదని.
సినీ రంగంపై విపక్ష చూపిస్తున్నట్లు ఆరోపణలు కురిపించింది.చాలా సినిమాలు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని.
కానీ మహారాష్ట్ర ప్రభుత్వం థియేటర్లు తెరవకుండా చేస్తుంది అంటూ కంగనా రనౌత్ సీరియస్ కామెంట్లు చేసింది.
ఈ ఈ విషయంలో సినిమా ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడకపోవడం దారుణమని పేర్కొన్నారు.జయలలిత జీవిత కథ ఆధారంగా కంగనా రనౌత్ నటించిన తలైవి సినిమా.
విడుదల కావాల్సి ఉండగా మహారాష్ట్రలో థియేటర్లనీ.ప్రభుత్వం ఓపెన్ చేయడానికి అనుమతులు ఇవ్వకపోవడంపై.
కంగనా రనౌత్ ఈ రీతిగా కామెంట్లు చేయడం జరిగింది.వైరస్ ప్రభావం దేశంలో తగ్గుముఖం పట్టిన గాని.
సినిమా హాల్లు ఎందుకు రావడం లేదో.ఎవరికి అర్థం కావటం లేదు.
అన్న తరహాలో ప్రభుత్వంపై కంగనారనౌత్ విమర్శలు చేసింది.