ఓటీటీలో అయితే అశ్లీలతను కూడా చూపించొచ్చు.. కంగనా షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ( Kangana Ranauth )గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

వివాదాస్పద అంశాల గురించి కంగనా రనౌత్ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.ఎమర్జెన్సీ సినిమా ( Emergency Movie )వాయిదా గురించి కంగనా స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

సెప్టెంబర్ నెల 6వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది.

సెన్సార్ బోర్డ్ నుంచి ఈ సినిమాకు కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.అయితే ఎమర్జెన్సీ సినిమాకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి కంగనా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

నా సినిమాపై కూడా ఎమర్జెన్సీ విధించారని ఆమె అన్నారు.ఇది చాలా విచారకరమైన పరిస్థితి అని నేను నిరాశకు గురయ్యానని కంగనా పేర్కొన్నారు.

అదే సమయంలో కంగనా రనౌత్ సెన్సార్ బోర్డ్ పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

"""/" / దేశంలోని చట్టం ఏంటంటే ఓటీటీలో( OTT ) అయితే సెన్సార్ ఉండదని కంగనా తెలిపారు.

ఓటీటీలలో అనూహ్యమైన హింసను, అశ్లీలతను ప్రదర్శించవచ్చని కంగనా చెప్పుకొచ్చారు.రాజకీయంగా పలుకుబడి ఉంటే రియల్ లైఫ్ ఘటనలను సైతం వక్రీకరించి సినిమాలు తీయవచ్చని కంగనా చెప్పుకొచ్చారు.

ఓటీటీలలో అంత ఫ్రీడమ్ ఉంటుందని కానీ ఆ ఫ్రీడమ్ లో కొంచెం కూడా మాలాంటి వాళ్లకు ఉండదని కంగనా తెలిపారు.

"""/" / మన దేశ సమగ్రత, ఐక్యత చుట్టూ తిరిగే చిత్రాలను తీయడానికి మాకు అనుమతి ఉండదని ఆమె చెప్పుకొచ్చారు.

కొన్ని చిత్రాలు తీయడానికే మనలో కొంతమందికి మాత్రమే సెన్సార్ షిప్ ఉందని కంగనా వెల్లడించారు.

ఇది అన్యాయమని కంగనా రనౌత్ వెల్లడించారు.కంగనా రనౌత్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కంగనా రనౌత్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

గేమ్‌ ఛేంజర్‌ ‘దోప్‌’ సాంగ్‌ విడుదల.. డాన్సుతో మెస్మరైజ్ చేసిన గ్లోబల్ స్టార్