డబ్బుల్లేక పన్ను చెల్లించని కంగనా.. తనకు ఉపాధి లేదంటూ..?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే.

తాజాగా ఈ స్టార్ హీరోయిన్ పన్ను చెల్లించడం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన దగ్గర డబ్బులు లేవని ఆ కారణం వల్లే తాను ఈ ఏడాది పన్ను చెల్లించలేదని కంగనా చెప్పుకొచ్చారు.

కరోనా సెకండ్ వేవ్ వల్ల దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్నాయి.

లాక్ డౌన్ వల్ల పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలు చేయడంతో పాటు షూటింగ్ లకు అనుమతులు ఇవ్వలేదు.

షూటింగ్ లు ఆగిపోవడం వల్ల సినిమా రంగంపై ఆధారపడిన ఎంతోమంది ఉపాధిని కోల్పోగా తన సినిమాల షూటింగ్ లు ఆగిపోవడంతో కంగనా రనౌత్ సైతం ఇంటికే పరిమితమయ్యారు.

తాజాగా కంగనా రనౌత్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా పెట్టిన పోస్ట్ లో తాను ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ చెల్లించే నటినని చెప్పుకొచ్చారు.

"""/"/ తన ఆదాయంలో ఏకంగా 45 శాతం ఆదాయాన్ని తాను ట్యాక్స్ గా చెల్లిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

అయితే ప్రస్తుతం తనకు ఉపాధి లేదని ఆ కారణం వల్ల ఇప్పటికే సగం పన్నును చెల్లించినా మిగతా సగం పన్నును చెల్లించలేకపోయానని కంగనా తెలిపారు.

ట్యాక్స్ ఆలస్యంగా చెల్లించడం వల్ల తాను అదనపు ఛార్జీలను చెల్లించాల్సి వస్తుందని కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు.

అదనపు ఛార్జీలను చెల్లించడానికి కూడా తాను సిద్ధమేనని కంగనా రనౌత్ చెప్పడం గమనార్హం.

తన లైఫ్ లో తొలిసారి పన్ను ఆలస్యంగా చెల్లిస్తున్నానని కంగనా అన్నారు.కంగనా రనౌత్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కంగనా పన్ను చెల్లించడం గురించి చేసిన కామెంట్లపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

దారుణం.. బస్సు డ్రైవర్ ని కట్టేసి దాడి చేసిన యజమాని.. (వీడియో)