పరిటాల సునీతగా కంగనా రనౌత్... కానీ అలా సీన్ మారిపోయింది!

బాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి అందరికీ పరిచయమే.నటిగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఇక ఈమె తన పరిచయాన్ని ఒక నటిగా కంటే వ్యక్తిగతంగా ఎక్కువగా పెంచుకుంది.

తన నటనకు ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది.లేడి ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది.

తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి 2004లో ఐలవ్యూ బాస్ అనే సినిమాతో పరిచయం అయింది.

తొలి నటనతోనే మంచి పేరు సంపాదించుకుంది.ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.

తెలుగులో కూడా నటించింది ఈ గ్లామర్ బ్యూటీ.తనకు బాలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇక ఈమెకు తెలుగులో మరో సినిమాలో కూడా అవకాశం వచ్చింది.ఇంతకు ఆ సినిమా ఏంటంటే.

"""/" / 2010లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'రక్త చరిత్ర'.ఈ సినిమాకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాను రాజకీయ నాయకులైన పరిటాల రవి, అతని శత్రువైన మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డిల వాస్తవిక నేపథ్యంలో విడుదలయింది.

ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందించారు.ఇక ఇందులో సూర్య, వివేక్ ఒబెరాయ్, ప్రియమణి, రాధిక ఆప్టే, కోట శ్రీనివాసరావు, సుశాంత్ సింగ్, తనికెళ్ల భరణి, అభిమన్యు సింగ్, శత్రుఘ్నసిన్హా, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించారు.

ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కించాడు దర్శకుడు.ఇక ఈ సినిమా విడుదలై మంచి సక్సెస్ అందుకుంది.

ఇక ఈ సినిమా కథ ఏంటంటే.ఆనందపల్లి అనే ఊరికి చెందిన ప్రతాప్ రవి పట్నంలో చదువుకుంటాడు.

దీంతో ఊర్లో ఉన్న తన తండ్రి హత్యకు గురయ్యాడని తెలుస్తుంది.ఇక తన అన్నయ్య కూడా తన తండ్రిని చంపిన వాళ్ళను చంపాలని అనుకుంటాడు.

ప్రతాప్ రవి కూడా తన అన్నకు సపోర్ట్ గా ఉంటాడు.ఆ తర్వాత తన అన్నను పోలీసులు తీసుకెళ్లి మరణ శిక్ష వేస్తారు.

దీంతో తన తండ్రి, అన్న మరణాన్ని తట్టుకోలేక వారి చావుకి కారణమైన వాళ్లను చంపేస్తాడు.

దీంతో అక్కడ రవి చంపిన వ్యక్తి కొడుకు రవిని చంపటానికి ప్రయత్నిస్తాడు.అదే సమయంలో ఓ సినిమా స్టార్ తరపున రవికి పార్టీలో టికెట్ అందుతుంది.

"""/" / ఇక తట్టుకోలేక ఆ వ్యక్తి కొడుకు మరింత పగ తీర్చుకోవాలని అనుకుంటాడు.

ఆ తర్వాత ఎదురైన పరిణామాలే ఈ సినిమాలోని కథ.అయితే ఇందులో పరిటాల రవి భార్య పరిటాల సునీత.

ఈమె తన భర్త రవి చనిపోవటంతో తను కూడా రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని అడుగు పెడుతుంది.

అలా సునీత పాత్ర కూడా ఇందులో కీలకమైనదే.దీంతో ఈ పాత్రకు ముందుగా కంగనా రనౌత్ ను తీసుకున్నారు.

కానీ ఏం జరిగిందో తెలియదు కానీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈమెను కాదని మరో నటి రాధిక ఆప్టే ను తీసుకున్నాడు.

ఇందులో రాధిక ఆప్టే పరిటాల సునీత గా నటించి పాత్రకు మంచి న్యాయం చేసింది.

అధిక రక్తపోటుకు చెక్ పెట్టాలా.. అయితే మీ డైట్ లో ఇది ఉండాల్సిందే!