ఆ ఇంజెక్షన్ ధర అక్షరాలా రూ. 18 కోట్లు.. ఏ వ్యాధి కోసమంటే?

ఆశ్చర్యంగా అనిపించినా మీరు విన్నది నిజమే.ఆ వ్యాధి చికిత్సకు కావాల్సిన ఇంజక్షన్‌కు రూ.

18 కోట్లు ఖర్చవుతుంది.విషయంలోకి వెళితే, ఢిల్లీలో నివసిస్తున్న కనక్ జాంగ్రా( Kanak Jangra ) అనే చిన్నారి “స్పైనల్ మస్కులర్ అట్రోఫీ”( Spinal Muscular Atrophy ) అనే ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతోంది.

కానీ సామాన్యుడు భరించేలా వుందా ఆ ధర? కాదు కదా.అయితే ప్రజలు కనక్ పట్ల చూపిన ఆదరణ ముందు ఆ వ్యాధి చిన్నబోయింది.

చికిత్స కోసం వెచ్చించిన మొత్తాన్ని ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించడం జరిగింది.

తద్వారా దాదాపు రూ.11 కోట్లు వసూలయ్యాయి.

"""/" / అయితే ఈ వ్యాధి చికిత్సకు కావాల్సిన ఇంజక్షన్‌ ( Injection ) ధరేమో రూ.

18 కోట్లు.కాగా సదరు ఫార్మాస్యూటికల్ కంపెనీ కేవలం రూ.

11 కోట్లకే ఇంజక్షన్ ఇచ్చి కనవ్ ప్రాణాలను కాపాడింది.అయితే ఇక్కడ మనం రూ.

18 కోట్లు ఖర్చయ్యే ఈ వ్యాధి గురించి ఈ సందర్బంగా తెలుసుకొని తీరాలి.

వెన్నెముక కండరాల క్షీణత వ్యాధి అనేది జన్యుపరమైన వ్యాధి.ఇది తల్లిదండ్రుల నుండి వారి నెక్స్ట్ తరానికి పాకుతుంది.

ఈ వ్యాధికి జొల్జెన్స్మా ఇంజక్షన్ మాత్రమే చికిత్స.ఈ ఇంజక్షన్ ఖరీదు రూ.

18 కోట్లు.ఈ వ్యాధితో బాధపడుతున్న చాలా మంది పిల్లలు చనిపోవడానికి ఇదే కారణం.

వ్యాధి పుట్టిన వెంటనే వెన్నెముక కండరాల క్షీణత సంభవిస్తుంది. """/" / అయితే దీనికి ఇంకా ఏ మందు కూడా పని చేయదు.

ఈ వ్యాధి కారణంగా పిల్లల శరీర కండరాలు బలహీనంగా మారడం ప్రారంభిస్తాయి.కాళ్లు, చేతులు పనిచేయడం మానేస్తాయి.

తరువాత తరువాత మెల్లగా వెన్నుపామును దెబ్బతీయడం ప్రారంభిస్తుంది.దీని కారణంగా నడవడం, ఎవరితోనైనా మాట్లాడటం కూడా కష్టం అవుతుంది.

జన్యువులు కనిపించకపోవడం వల్లే ఈ వ్యాధి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.జోల్జెన్స్మా ఇంజెక్షన్ ని( Zolgensma Injection ) ఒక అమెరికన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ మాత్రమే తయారు చేస్తుంది.

ఇది పిల్లలను పూర్తిగా వికలాంగులను చేస్తుంది.దీని లక్షణాలు కూడా ప్రారంభంలోనే కనిపించడం ప్రారంభిస్తాయి.

ఈ వ్యాధి కేసులు చాలా అరుదుగా ఉన్నప్పటికీ, ఎవరికైనా ఈ వ్యాధి వచ్చినట్లయితే.

వారిని కాపాడుకోవడం చాలా కష్టం.

చరణ్ కియరా జోడికి కలసి రాలేదా…అప్పుడు అలా… ఇప్పుడు ఇలా?