ఈ పార్టీలో నేను సుఖంగా ఉన్నా ... ఆ పార్టీలో చేరడం లేదు

చేవేళ్ల టీఆర్ఎస్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ మారడంతో ఆయన బాటలో మరికొందరు కూడా.

పార్టీ మారుతున్నారనే ప్రచారం కొద్దిరోజులుగా ఊపందుకుంది.ఈ క్రమంలోనే ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలు వినిపించాయి.

గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.ఆ తరువాత టీఆర్ఎస్‌లో చేరారు.

అయితే ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ టీఆర్ఎస్‌లో తాను చిత్తశుద్ధి తో,ఒక సైనికుడిలా పనిచేస్తున్నానని.

ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడేది లేదని .తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే అని పొంగులేటి తెలియజేసారు.

టీఆర్ఎస్ లో తాను సుఖంగా ఉన్నానని తెలిపారు.జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు పది టీఆర్ఎస్ గెలుచుకుంటుందని ఆయన వెల్లడించారు.

ఏప్రాంతానికి వెళ్లినా, గిరిజన ప్రాంతానికి వెళ్ళినా ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభిస్తుందన్నారు.

భట్టికి మధిరలో ఓడిపోతానన్న భయం పట్టుకుందని విమర్శించారు.భట్టి కోటకు బీటలు వారుతున్నాయని తెలిపారు.

పరోక్షంగా నాపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని తెలిపారు.చిత్తశుద్ధితో, ఒక సైనికుడిలా టీఆర్ఎస్ లో పనిచేస్తున్నానని వెల్లడించారు.

ఖాళీగా ఉన్నా పర్వాలేదు కానీ ఏ సినిమా పడితే ఆ సినిమా చేయను అంటున్న హీరోయిన్స్