కామాఖ్య ఆలయ చరిత్ర తెలిస్తే షాక‌వుతారు

భారతదేశం హిందూ ధ‌ర్మంతో ముడిప‌డిన దేశం.హిందూమతంతో సంబంధం ఉన్న అనేక చారిత్రక దేవాలయాలు భారతదేశంలోనే కనిపిస్తాయి.

పురాణాల ప్ర‌కారం సతీదేవిని విష్ణువు త‌న సుద‌ర్శ‌నంతో 51 ముక్కలుగా న‌రికిన‌ప్పుడు ఆ భాగాలు ప‌డిన ప్రాంతాలు శ‌క్తి పీఠాలుగా ఉద్భ‌వించాయి.

ఈ ప్రదేశాలను పవిత్ర పుణ్యక్షేత్రాలు అంటారు.అందులో కామాఖ్య దేవాలయం కూడా ఒక‌టి.

ఇది అస్సాంలోని గౌహతి నీలాంచల్ కొండ ప్రాంతంలో ఉంది.తాత‌, కమల, భైరవి, భునేశ్వరి, మాతంగి ధూమావతి, త్రిపుర సుందరి మొదలైన 10 దేవీ రూపాలు ఈ ఆలయంలో కనిపిస్తాయి.

ఇప్పుడు మనం కామాఖ్య దేవాలయ చరిత్ర, దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం సతీదేవి తండ్రి అయిన ప్రజాపతి దక్షుడు.త‌న అల్లుడైన‌ శివుడిని ఆహ్వానించకుండా ఒక గొప్ప యజ్ఞం నిర్వ‌హించాడు.

ఈ కార్య‌క్ర‌మానికి స‌తీదేవి వెళ్ల‌గా ద‌క్షుడు శివుని గురించి అవ‌మాన‌క‌రంగా మాట్లాడతాడు.దీంతో కోపానికి గురైన సతీదేవి హోమ గుండంలో దూకి ప్రాణత్యాగం చేసింది.

ఈ విషయం శివునికి తెలియడంతో ఆయ‌న‌ మహాయజ్ఞం జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి తన భార్య మృత దేహంతో తాండ‌వం చేయ‌డం మొదలుపెట్టాడు.

ఆ తరువాత విష్ణువు.శివుని కోపాన్ని చల్లార్చడానికి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 ముక్కలుగా చేశాడు.

"""/"/ ఈ భాగాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల‌లో ప‌డ‌తాయి.సతీ మాత శరీర భాగాలు ప‌డిన ప్రాంతాల‌ను శక్తిపీఠాలుగా పిలుస్తారు.

ఈ శ‌క్తి పీఠాల‌లో ఒక‌టే కామాఖ్య ఆల‌యం.కామాఖ్య దేవాలయం ఆకారం ఒక కొలనులా కనిపిస్తుంది, దాని చుట్టూ నీరు ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది.

పౌరాణిక క‌థ‌నాల‌పై ఉన్న న‌మ్మ‌కాల‌ ప్రకారం ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం అంబుబాచి జాతర నిర్వహిస్తారు, ఆ సమయంలో తల్లి కామాఖ్య స్వయంగా రుతుక్రమంలో ఉంటుంది.

ఈ కార‌ణంగా దేవాలయంలో ఎర్ర‌ని నీరు బ‌య‌ట‌కు వ‌స్తుంది.

వాల్‌మార్ట్‌లోని వస్తువులు నేలపై పడేస్తూ రచ్చ చేసిన బాలిక.. వీడియో చూస్తే షాకే..