కన్న కూతురిపై కామాంధుడి కన్ను.. అత్యాచారానికి !

కొందరు వ్యక్తులు వావీవరుసలు మరిచి క్రూర మృగాలుగా ప్రవర్తిస్తున్నారు.కన్న కూతుళ్లపై కర్కషత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.

కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే కామవాంఛతో కన్న కూతుర్లపై జూలం ప్రదర్శిస్తున్నారు.మద్యం మత్తులో వావీవరసలు మరిచి లైగింక దాడులకు పాల్పడుతున్నారు.

మహిళలకు సమాజంలోనే భద్రత లేదనుకుంటే ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోయిందని, ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా తప్పుపట్టిపోతున్నాయి కానీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేవారే లేరని మహిళ సంఘాలు ఆరోపిస్తున్నారు.

కన్న కూతురిపైనే లైగింక దాడికి యత్నించిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మణికరన్పాలయం ప్రాంతంలో తండ్రితోపాటు కుమార్తె(15) నివాసముంటున్నారు.రోజువారీ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

అయితే రెండు రోజుల కిందట తండ్రి మద్యాన్ని సేవించి ఇంటికి వచ్చాడు.తాగిన మైకంలో పడుకున్న కూతురి దగ్గరికి వెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు.

దీంతో బాలిక ఆ కామాంధుడి చెరసాల నుంచి బయటపడి బంధువుల సాయంతో స్థానిక మహిళా పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.

అనంతరం అతడిని కోయంబత్తూర్ సెంట్రల్ జైలుకు తరలించారు.

అల్లరి నరేష్, బెల్లంకొండ శ్రీనివాస్ ల పరిస్థితి ఏంటి..?