ఒకప్పటి ఈ హీరోయిన్ మీకు ఇంకా గుర్తుందా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల 2004వ సంవత్సరంలో తెరకెక్కించిన "ఆనంద్ - మంచి కాఫీలాంటి సినిమా" అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి హీరోయిన్ కమిలిని ముఖర్జీ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే ఇప్పుడు ఒక నటి కమిలిని ముఖర్జీ గురించి పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

నటి కమిలిని ముఖర్జీ కోల్కతా ప్రాంతంలో పుట్టి పెరిగింది.అయితే ఆమె తల్లి ప్రముఖ బంగారు నగల డిజైనర్ కాగా తన తండ్రి మెరైన్ ఇంజనీర్ గా పని చేసేవాడు.

ఈ అమ్మడు కోల్కతాలో ఉన్నటువంటి ఓ ప్రముఖ యూనివర్సిటీ లో ఇంగ్లీష్ లిటరేచర్ డిగ్రీని కూడా పూర్తి చేసింది.

అదే సమయంలో భరత నాట్యం కూడా నేర్చుకుంది.ఆ తర్వాత సినిమాల్లో నటించాలనే ఆసక్తి తో తెలిసిన వారి ద్వారా ఆనంద్ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.

ఈ చిత్రం మంచి హిట్ అవడంతో తమిళ, కన్నడ, మలయాళ, తదితర భాషలలో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంది.

అయితే ఈ అమ్మడు నటించిన ఎక్కువ శాతం చిత్రాలు మంచి హిట్ అయిన ప్పటికీ సినిమా సినిమాకి కొంతమేర గ్యాప్ ఎక్కువ రావడంతో ఈ అమ్మడిని ప్రేక్షకులు పెద్దగా గుర్తించలేదు.

కాగా తెలుగులో కమలినీ ముఖర్జీ తెలుగులో  నటించిన ఆనంద్, స్టైల్, గోపి గోపిక గోదావరి, హ్యాపీ డేస్, విరోధి, నాగవల్లి, గోవిందుడు అందరివాడేలే తదితర చిత్రాలు ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాయి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా చివరగా కమలినీ ముఖర్జీ తెలుగులో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వం వహించిన "గోవిందుడు అందరివాడేలే" చిత్రం లో కనిపించింది.

ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు తెలుగు సినిమాలలో నటించలేదు.అయితే ప్రస్తుతం కమలినీ ముఖర్జీ తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబై నగరంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 2, గురువారం 2024