తాతయ్యను మరోసారి గుర్తు చేసుకుంటూ భారతీయులను అటెన్షన్‌లో పెడుతున్న కమలా హారిస్
TeluguStop.com
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా భారత సంతతికి చెందిన సెనేటర్ కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఎంపిక చేశారు డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్.
భారతీయుల మద్ధతు కూడగట్టేందుకే డెమొక్రాట్లు ఈ ఎత్తు వేశారన్నది బహిరంగ రహస్యం.తద్వారా అమెరికా ఉపాధ్య పదవికి పోటీ చేస్తున్న తొలి నల్లజాతి మహిళగా కమలా హ్యారిస్ అగ్రరాజ్యంలో చరిత్ర సృష్టించారు.
భారత మూలాలున్న కమలా హారిస్ స్వస్థలం చెన్నై.ఆమె తల్లి భారతీయురాలు కాగా, తండ్రి జమైకన్.
వీలున్నప్పుడల్లా చిన్నతనంలో తన తాతయ్య పీవీ గోపాలన్‌తో గడిపిన జ్ఞాపకాలను ఆమె పంచుకుంటూ ఉంటారు.
తాజాగా మరోసారి చిన్ననాటి గుర్తులను పంచుకున్నారు.‘‘ తన బాల్యంలో భారత్‌కు వెళ్లినప్పుడు.
తాతయ్య తనను బీచ్‌కు వాకింగ్ తీసుకెళ్లేవారని గుర్తుచేసుకున్నారు.ఇంట్లో తానే పెద్ద మనవరాలిని అయినందున ఈ అవకాశం దక్కేదని.
బీచ్‌లో నడుచుకుంటూ వెళ్తూ ప్రజాస్వామ్యం గురించి, పౌరహక్కులకై పోరాడాల్సిన తీరు గురించి వివరించేవారని కమల చెప్పారు.
"""/"/
తన స్నేహితులంతా కూడా గొప్ప గొప్ప నాయకులుగా ఎదిగిన వాళ్లే.ఎక్కడ, ఏ పరిస్థితుల్లో జన్మించామనే విషయంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉంటాయని చెప్పేవారని వెల్లడించారు.
చిన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు నాలో పోరాటపటిమ రగిల్చాయని ఆమె పేర్కొన్నారు.భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న ఆయన తనపై ఎంతో ప్రభావం చూపారని, అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నానని చెప్పుకొచ్చారు.
ఈ మేరకు తన బామ్మ, తాతయ్యల ఫోటోలు, భారత స్వాతంత్ర్య పోరాటంలోని దృశ్యాలతో పాటు అమెరికాలో తాను పౌర హక్కుల ఉద్యమంలో పాల్గొన్న ఫోటోలతో కూడిన 57 సెకండ్ల నిడివి గల వీడియోను కమలా హారిస్ ట్వీట్టర్‌లో షేర్ చేశారు.
ప్రచారంలో భాగంగా ట్రంప్ విధానాలపై విమర్శలు చేస్తూనే, తన భారత మూలాలను గుర్తు చేసుకుంటూ ఇండో అమెరికన్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారామె.
శంకర్ పేరు చెబితేనే భయంతో పరుగులు పెడుతున్న స్టార్ హీరోలు…