అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ఉపాధ్యక్ష అభ్యర్ధిగా టిమ్ వాల్జ్, కమలా హారిస్ ఎంపిక సరైనదేనా..?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధిగా , ప్రస్తుత ఉపాధ్యక్షురాలు , భారత సంతతికి చెందిన కమలా హారిస్ ( Kamala Harris )ఖరారయ్యారు.

డెమొక్రాట్ నామినేషన్ కోసం ఆమెకు అనుకూలంగా 99 శాతం మంది పార్టీ ప్రతినిధుల ఓట్లు లభించాయి.

అమెరికా వ్యాప్తంగా సుమారు 4,567 మంది హారిస్‌కు ఓట్లు వేశారు.తద్వారా అమెరికాలోని ఓ ప్రధాన రాజకీయ పార్టీ నుంచి నామినేషన్ పొందిన తొలి భారతీయ అమెరికన్‌గా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు.

కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్ధిగా ఎంపికయ్యారు సరే.మరి ఉపాధ్యక్ష అభ్యర్ధి ఎవరు అంటూ డెమొక్రాట్లు, రాజకీయ వర్గాల్లో( Democrats, In Political Circles ) చర్చ జరుగుతుండగా దీనికి ఆమె తెరదించారు.

తన రన్నింగ్‌మెట్‌గా మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్‌ను( Minnesota Governor Tim Walz ) ఎంపిక చేసినట్లుగా అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

"""/" / నెబ్రస్కాలో( Nebraska ) పుట్టి పెరిగిన వాల్జ్( Walz ).

ఉపాధ్యాయుడిగా, ఫుట్‌బాల్ కోచ్‌గా పనిచేశారు.రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి ముందు మిన్నెసోటాలోని మంకాటో వెస్ట్ హైస్కూల్ యూనియన్ మెంబర్‌గా సేవలందించారు.

ఆర్మీ నేషనల్ గార్డులో దాదాపు రెండున్నర దశాబ్ధల పాటు విధులు నిర్వర్తించారు.2018లో మిన్నెసోటా గవర్నర్‌గా పోటీ చేసి విజయం సాధించారు.

వాల్జ్‌ను ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఎంపిక చేయడం ద్వారా.నవంబర్ 5న జరగనున్న ఎన్నికల్లో అమెరికాలోని పశ్చిమ, మధ్య రాష్ట్రాల్లో డెమొక్రాటిక్ పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తన వాగ్ధాటి, విషయ పరిజ్ఞానంతో రిపబ్లికన్ పార్టీ( Republican Party ) విధానాలను ఎండగట్టే వాల్జ్.

డొనాల్డ్ ట్రంప్, ఆ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధి జేడీ వాన్స్‌లు చిత్రమైన వ్యక్తులంటూ వ్యాఖ్యానించారు.

వాల్జ్ ఎంపికపై డెమొక్రాటిక్ పార్టీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. """/" / మరోవైపు.

కమల తన ప్రత్యర్ధిగా దాదాపు ఖరారు కావడంతో డొనాల్డ్ ట్రంప్( Donald Trump ), ఆయన మద్ధతుదారులు ఉపాధ్యక్షురాలిని టార్గెట్ చేస్తున్నారు.

ఆమె జాతీయత, వ్యక్తిగత విషయాలపై విమర్శలు గుప్పిస్తున్నారు.దీనికి కమలా హారిస్ కౌంటర్ స్టార్ట్ చేశారు.

ట్రంప్ విధానాలతో కలత చెందిన రిపబ్లికన్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ‘‘రిపబ్లికన్స్ ఫర్ హారిస్’’ను ప్రారంభించారు.