కాస్కో ట్రంప్.. ‘రిపబ్లికన్స్ ఫర్ హారిస్’ ప్రారంభించిన కమలా హారిస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ( Democratic Party ) అభ్యర్ధిగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హారిస్( Kamala Harris ) అభ్యర్ధిత్వం ఖరారైంది.

అభ్యక్ష అభ్యర్ధిత్వం కోసం కావాల్సిన ప్రతినిధుల ఓట్లను వర్చువల్ రోల్ కాల్‌లో ఆమె సాధించినట్లు డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ ఛైర్ జేమ్ హరిసన్( Jaime Harrison ) ప్రకటించారు.

డెలిగేట్‌ల ఓటింగ్ ప్రక్రియ సోమవారం వరకు జరగనుండగా.మెజారిటీ ఓట్లను ఆమె పొందినట్లుగా ఆయన తెలిపారు.

చికాగో వేదికగా ఈ నెల చివరిలో జరగనున్న డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో కమలా హారిస్ పేరును అధ్యక్ష అభ్యర్ధిగా లాంఛనంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అదే జరిగితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓ పార్టీ నుంచి అభ్యర్ధిగా పోటీ చేయనున్న విదేశీ సంతతికి చెందిన మహిళగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు.

కమల అధికారిక నామినేషన్ ఆగస్ట్ 7న ఖరారు కానుంది. """/" / కమల తన ప్రత్యర్ధిగా దాదాపు ఖరారు కావడంతో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్( Donald Trump ), ఆయన మద్ధతుదారులు ఉపాధ్యక్షురాలిని టార్గెట్ చేస్తున్నారు.

ఆమె జాతీయత, వ్యక్తిగత విషయాలపై విమర్శలు గుప్పిస్తున్నారు.దీనికి కమలా హారిస్ కౌంటర్ స్టార్ట్ చేశారు.

ట్రంప్ విధానాలతో కలత చెందిన రిపబ్లికన్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ‘‘రిపబ్లికన్స్ ఫర్ హారిస్( Republicans For Harris )’’ను ప్రారంభించారు.

గతంలో రిపబ్లికన్స్ ఫర్ బైడెన్‌గా పిలవబడిన ఈ బృందం .అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి బైడెన్ తప్పుకున్న తర్వాత తిరిగి ప్రారంభించబడింది.

"""/" / పునరుద్ధరించబడిన ఈ కార్యక్రమం 25కు పైగా జీవోపీ నేతల ఆమోదాలను పొందింది.

ఇందులో మాజీ కార్యదర్శులు చక్ హగెల్, రే లాహుడ్.ట్రంప్ హయాంలో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ స్టెఫానీ గ్రిషమ్, మాజీ ఉపాధ్యక్షడు మైక్ పెన్స్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు ఒలివియా ట్రోయ్ ఉన్నారు.

వైట్‌హౌస్‌లో సమగ్రతను కాపాడుకోవడానికి, మనదేశ ప్రజాస్వామ్యాన్ని నిర్ధారించడానికి ఈ నవంబర్‌లో కమలా హారిస్‌‌కు అండగా ఉండాలని తాను ప్రోత్సహిస్తున్నానని గ్రిషమ్ ఓ ప్రకటనలో తెలిపారు.

రిపబ్లికన్స్ ఫర్ హారిస్ ఈ వారం అరిజోనా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియాలలో లక్షిత ప్రకటనలు, ఈవెంట్‌లతో ప్రారంభమవుతుంది.

హారిస్‌కు మద్ధతు ఇచ్చిన రిపబ్లికన్‌లు కూడా త్వరలో ప్రకటించనున్న రన్నింగ్ మేట్‌తో పాటు ప్రచార ర్యాలీలకు హాజరవుతారు.

జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు.. ఆ వార్తల వల్ల ఆమె మనస్తాపం చెందారా?