కమల్ వల్ల చిరుపై ఒత్తిడి.. మెగాస్టార్ మారాల్సిందే అంటున్న ఫ్యాన్స్!

టాలీవుడ్ అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా ఎంతో ఫిట్ గా ఉంటూ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ కుర్ర హీరోలకే సవాల్ విసురుతున్నాడు.

అయితే ఈయన నటించిన ఆచార్య సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి ఈయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా మిగిలి పోయింది.

దీంతో మెగా ఫ్యాన్స్ సైతం తీవ్ర నిరాశ వ్యక్తం చేసారు.ఈ సినిమాకు దాదాపు 70 కోట్ల నష్టం వచ్చింది.

ఈ సినిమా తర్వాత చేసే సినిమాలు కూడా రీమేక్ సినిమాలే కావడం ఈయనకు మైనస్ అవుతుంది.

ప్రెసెంట్ చిరంజీవి తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.

అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు.అలాగే ఈయన లైనప్ లో మరో ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు.

అందులో బాబీ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది.ఈ సినిమాకు వాల్తేర్ వీరయ్య అనే టైటిల్ ను అనుకుంటున్నారు.

అయితే ఇవన్నీ రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లోనే ఉండనున్నాయి.ఇలా చిరంజీవి రొటీన్ కథలను పక్కన పెట్టి ప్రయోగాత్మక సినిమాలు చేస్తే చాలా బాగుంటుంది అని చాలా మంది ఆలోచన.

"""/"/ ఇటీవలే కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు.

కమర్షియల్ అంశాలను పక్కన పెట్టి చేసిన ఈ సినిమా ఆడియెన్స్ ను బాగా అలరించింది.

మెగాస్టార్ రొటీన్ కథలను ఎంచుకోవడంతో ఫ్యాన్స్ ఈ సినిమాలపై పెద్దగా ఆసక్తి కనపర్చడం లేదు.

కమల్ విక్రమ్ భారీ విజయంతో మెగాస్టార్ కూడా ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేస్తే బాగుంటుంది అని అభిమానులు ఒత్తిడి తెస్తున్నారు.

మరి మెగాస్టార్ ముందు ముందు అయినా కమర్షియల్ పక్కన పెడతాడో లేదో చూడాలి.

హమారా బిహార్! జపాన్ యూట్యూబర్‌కు వాల్మీకి టైగర్ రిజర్వ్‌లో అద్భుత అనుభవం..