30 రోజులు 100 కోట్లు.. సూపర్ కమల్ సర్..!

ప్రభాస్( Prabhas ) ప్రాజెక్ట్ K( Project K ) లో లోకనాయకుడు కమల్ హాసన్( Kamal Haasan ) నటిస్తున్నారని తెలిసిందే.

ఈ సినిమాలో కమల్ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తుంది.సినిమా కోసం కమల్ హాసన్ భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

ముందు ఈ పాత్రకు వేరే ఎవర్నో అనుకోగా కమల్ అయితే సినిమాకు ఇంకాస్త హైప్ వస్తుందని భావించి ఆయన్ను తీసుకున్నారు.

ఎప్పుడు ప్రయోగాలకు రెడీ అనే కమల్ సర్ నాగ్ అశ్విన్ చెప్పిన కథ నచ్చి ఓకే అన్నారు.

500 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ప్రాజెక్ట్ K సినిమా లో కమల్ హాసన్ కూడా భాగం అవుతున్నాడు.

"""/" / ఆగష్టు నుంచి కమల్ హాసన్ సీన్స్ షూట్ చేస్తారని తెలుస్తుంది.

సినిమా కోసం కమల్ 30 రోజులు డేట్స్ ఇవ్వగా అందుకు 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తుంది.

కమల్ రేంజ్ కి అంత ఇవ్వడంలో తప్పులేదు.ఇక కమల్ ఈ ప్రాజెక్ట్ లో చేయడం వల్ల తమిళ్ లో ఈ సినిమాకు మంచి మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంది.

మొత్తానికి కమల్ హాసన్ రాకతో ప్రాజెక్ట్ K పై మరింత అంచనాలు పెరిగాయి.

ఈ సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారని తెలిసిందే.

శ్రీకాంత్ ఓదెల చిరంజీవిని ఎలా చూపించబోతున్నాడు….