కమల్‌ను వారు వేదిస్తున్నారట

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ను తమిళనాడు పోలీసులు వేదిస్తున్నారట.గత రెండు వారాలుగా పదే పదే విచారణ పేరుతో తన ఇంటికి రావడం లేదంటే పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించడం చేస్తున్నారట.

తన వ్యక్తిగత పనులకు భంగం కలిగించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు అంటూ తమిళనాడు హైకోర్టుకు పోలీసులపై ఫిర్యాదు చేశాడు.

హైకోర్టు కమల్‌ పిటీషన్‌ను స్వీకరించింది.ఇరు వర్గాల వారి వాదనలు వినేందుకు ఒప్పుకుంది.

కేసు ముగిసే వరకు కమల్‌ను విచారణకు పిలవొద్దంటూ కోర్టు పోలీసులకు సూచించింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ఇండియన్‌ 2 షూటింగ్‌ సందర్బంగా ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందడటంతో పాటు పలువురు గాయాలపాలయిన విషయం తెల్సిందే.

దాంతో ఇండియన్‌ 2 యూనిట్‌ సభ్యులందరిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్శకుడు శంకర్‌, కమల్‌, కాజల్‌లను విచారణకు పిలిచారు.

ఇప్పటికే వీరు విచారణకు హాజరు అయ్యి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.మళ్లీ మళ్లీ కూడా వీరిని విచారణకు పిలుస్తున్నారట.

"""/"/కమల్‌ను విచారణ పేరుతో పోలీసులు వేదిస్తున్నారట.తన రాజకీయ మరియు సినీ జీవితంకు భంగం కలిగేలా పోలీసులు ప్రవర్తిస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.

హైకోర్టు ఈ విషయమై చర్యలు తీసుకోవాలంటూ ఆయన విజ్ఞప్తి చేశాడు.మరి తమిళనాడు పోలీసులపై హైకోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అసలు కేసు విచారణకు హాజరు అయ్యేందుకు కమల్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటీ అనేది హైకోర్టులో విచరణ తర్వాత తేలనుంది.

శనగ పంటలో పోషక ఎరువుల యాజమాన్యం.. పంట విత్తుకునే విధానం..!