ప్రభాస్ పెదనాన్న నాకు వార్నింగ్ ఇచ్చారు.. కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం కల్కి( Kalki 2898 AD ).
ఈ సినిమా ఈనెల 27న విడుదల కానుంది.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించగా అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ లాంటి సెలబ్రిటీలు కూడా కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలను నెలకొన్నాయి.ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే తాజాగా ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, ప్రియాంక దత్, స్వప్నదత్ లు కలిసి ఒక స్పెషల్ చిట్ చాట్ చేసి వీడియో రిలీజ్ చేశారు.
"""/" /
ఈ స్పెషల్ చిట్ చాట్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
అయితే ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలపగా కమల్ హాసన్, అమితాబ్ తాము యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు చేసిన సినిమాలు, అప్పటి పరిస్థితుల గురించి కూడా మాట్లాడారు.
ఈ క్రమంలో కమల్ హాసన్( Kamal Haasan ) ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ( Krishanm Raju )గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆ వీడియోలో కమల్ హాసన్ మాట్లాడుతూ.ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు గారు నాకు తెలుసు.
ఆయనతో కలిసి నేను పనిచేసాను.నేను డ్యాన్స్ అసిస్టెంట్ గా పనిచేసేటప్పుడు ఆయన హీరోగా చేస్తున్నారు.
"""/" /
కృష్ణం రాజు చేస్తున్న ఒక సినిమాకు నేను డ్యాన్స్ అసిస్టెంట్ గా వర్క్ చేశాను.
ఆయనకు స్టెప్పులు ఇస్తుంటే ఇలాంటి కష్టమైన స్టెప్స్ ఇవ్వకు అని భయపెట్టేవాళ్ళు.ఆయనకు అంతగా డ్యాన్స్ రాదు.
అందుకే నన్ను సరదాగా భయపెట్టేవాళ్ళు.కష్టమైన స్టెప్స్ ఇస్తే నీ పని చెప్తా అని వార్నింగ్ ఇచ్చేవాళ్ళు అని అప్పటి సంగతులను గుర్తుచేసుకున్నారు.
దీంతో కమల్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి24, సోమవారం 2025