కమల్ చేతులు పట్టుకుని వేడుకున్నా ఆయన నటించలేదట.. ఏమైందంటే?

భాషతో సంబంధం లేకుండా కమల్ హాసన్ కు అభిమానులు ఉన్నారు.ఎలాంటి పాత్రలో నటించినా తన నటనతో కమల్ హాసన్ ప్రాణం పోస్తారు.

వచ్చే నెల 3వ తేదీన కమల్ నటించిన విక్రమ్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

నితిన్ తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాను విడుదల చేస్తుండగా ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ అంటే సినిమా గ్యారంటీ హిట్ అని అందరూ భావిస్తారు.

అయితే విక్రమ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ కమల్ హాసన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

మన దేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశమని సినిమాలు యూనివర్సల్ భాష మాట్లాడతాయని కమల్ హాసన్ కామెంట్లు చేశారు.

ఒకే దేశంలో నివశించే మనం ఒకే భాష మాట్లాడకపోయినా జాతీయ గీతాన్ని మాత్రం ఒకటిగానే పాడతామని కమల్ అన్నారు.

"""/" / ప్రజలను ఏకం చేసేవాటిలో సినిమాలు ముందువరసలో ఉంటాయని సినిమా హాల్ లో కులం, మతం అడగమని అయన చెప్పుకొచ్చారు.

సక్సెస్ సాధిస్తున్నది ఇండియన్ సినిమా అని సినిమాలకు ఒకే భాష లేకపోయినా సినిమాలన్నీ ఒకటే అని ఒకరినొకరు గౌరవించుకోవాలని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.

ఇతర నటీనటులతో నటించడం తనకు ఇష్టమని కమల్ హాసన్ అన్నారు.అయితే బాలీవుడ్ స్టార్ దిలీప్ కుమార్ తో కలిసి తాను పని చేయాలని అనుకున్నా సాధ్యం కాలేదని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.

తేవర్ మగన్ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని అనుకున్న సమయంలో ఆ సినిమాలో నటించాలని దిలీప్ కుమార్ ను కోరానని చేతులు పట్టుకుని వేడుకున్నా ఆయన సినిమాలో నటించడానికి అంగీకరించలేదని కమల్ హాసన్ వెల్లడించారు.

జ్యోతిష్యుడిని నమ్మి లాటరీ కొన్న యూఎస్ మహిళ.. కట్ చేస్తే రూ.4కోట్లు గెలిచింది..