ప్రాజెక్ట్ కే సెట్స్ లో అడుగుపెట్టిన కమల్.. నాలుగు వారాల పాటు షూట్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ''ప్రాజెక్ట్ కే'' ఒకటి.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ సినిమా నుండి అప్డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా ఇప్పటికే 75 శాతానికి పైగానే షూట్ పూర్తి చేసుకుంది.

అయినప్పటికీ ఈ సినిమా నుండి ఏదొక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.

ఇంకా ఈ సినిమాలో కొత్త కొత్త యాక్టర్స్ భాగం చేస్తూనే ఉన్నాడు నాగ్ అశ్విన్.

ఇప్పటికే పలు క్రేజీ పోస్టర్స్ తో పాటుగా ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియోస్ కూడా రిలీజ్ చేసి ఈ సినిమాపై హైప్ పెంచేయగా ఈ మధ్య వచ్చిన గాసిప్ తో మరింత హైప్ పెరిగింది.

"""/" / ఈ సినిమాలో దీపికా పదుకొనే, బిగ్ బి వంటి స్టార్స్ భాగం అయిన విషయం విదితమే.

వీరు మాత్రమే కాకుండా ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా కీలక పాత్ర చేస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

మరి ఈ వార్త నిజమే అని ఈ మధ్య క్లారిటీ రాగా ఇప్పుడు ఈయన షూట్ లో కూడా జాయిన్ అయినట్టు క్లారిటీ తెలుస్తుంది.

"""/" / తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసేందుకు కమల్ హాసన్ సెట్స్ లో అడుగు పెట్టారని ఈయనపై నాలుగు వారాల పాటు షూటింగ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

మరి ఈ రూమర్స్ తో ప్రాజెక్ట్ కే సినిమా మరోసారి వార్తల్లో నిలువగా ప్రభాస్ ఫ్యాన్స్ మరింత ఇంట్రెస్ట్ పెడుతున్నారు.

ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేయబోతుండగా.

అశ్వనీదత్ 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

How Modern Technology Shapes The IGaming Experience