ఇండియన్2 టికెట్స్ తమిళనాడులోనే చీపా.. టికెట్ రేట్లు పెంచి ఏం సాధిస్తారంటూ?

తమిళ దర్శకుడు శంకర్( Director Shankar ), విశ్వ నటుడు కమల్ హాసన్ ( Universal Actor Kamal Haasan )కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ఇండియన్ 2.

ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.1996లో విడుదలైన సూపర్ హిట్ మూవీ భారతీయుడు కు సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే.

కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ భారీ ప్రాజెక్ట్ మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. """/" / ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను పెంచాయి.

ఇది ఇలా ఉంటే తెలంగాణలో వారం రోజుల పాటు టికెట్స్ పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌ల్లో రూ.75, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.

50 టికెట్‌పై పెంచుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో హైదరాబాద్‌ లోని మల్టీప్లెక్స్‌ల్లోని ఒక్కో టికెట్ ధర రూ.

350 రూపాయలుగా ఉంది.అయితే ఇండియన్-2 ( Indian-2 )సినిమాకు చెన్నైలో మాత్రం ఇందుకు భిన్నంగా టికెట్ రేట్లు దర్శమిస్తున్నాయి.

చెన్నైలోని మల్టీప్లెక్స్‌ల్లో ఒక్కో టికెట్‌ ధర కేవలం రూ.190 రూపాయలుగా ఉంది.

దీంతో ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారింది. """/" / కోలీవుడ్ సినిమాకు తెలుగులో టికెట్ రేట్లు ఎక్కువ ఉండడమేంటని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

ఇండియన్ 2 కి తమిళనాడులో టికెట్స్ ఇంత చీపా అంటూ ప్రశ్నిస్తున్నారు.ఇలా అయితే తెలుగు రాష్ట్రాలలో టికెట్లు రేట్లు పెంచి ఏం సాధిస్తారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

కొందరు ఈ విషయంపై పాజిటివ్గా స్పందిస్తుండగా మరి కొందరు ఈ విషయంపై నెగటివ్ స్పందిస్తూ కాస్త మండిపడుతున్నారు.

జగన్ అమాయకుడు.. న్యాయం చేయాలి.. వైరల్ అవుతున్న నాగబాబు సంచలన ట్వీట్!