అరెరే కమలుడా..నీకెలా కన్నడ పరిశ్రమతో సంబంధం..!

కాంతారా సినిమా హిట్ అయ్యింది.ప్రభంజనం సృష్టించింది.

అతి తక్కువ బడ్జెట్ తో వచ్చి అతి పెద్ద విజయాన్ని మూటగట్టుకుంది.ఇదంతా ఎవ్వరు కాదనలేని సత్యం.

అందరు బహిరంగంగా ఒప్పుకుంటున్న వాస్తవాలు.సినిమా పుట్టిన రోజు నుంచి నేటి వరకు ఎన్నో వేళా సినిమాలు వచ్చాయి.

అందులో ఎన్నో వందల బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా ఉన్నాయ్.అయితే ఇప్పుడు కాంతారా మాత్రమే మొదటి హిట్ అన్నట్టుగా చాల మంది వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఏం చెప్పాలో అర్ధం కానీ పరిస్థితి.

ఇక ఈ మధ్య రజినీకాంత్ ఈ సినిమాను తన ఓన్ పరిశ్రమ అన్నట్టు గా స్పందించాడు కాబట్టి కమలుడు అదేనండి మన కమల్ హాసన్ కూడా ఒక భిన్నమైన రీతిలో స్పందించాడు.

నేను కన్నడ పరిశ్రమ వాడిని అంటూ ఇన్ని రోజులకు ఎలా మేల్కొన్నాడు అనేది పెద్ద ప్రశ్న.

రజినీకాంత్ స్పందించాడు అంటే అర్ధం ఉంది.ఎందుకంటే అతడి మూలాలు కర్ణాటకలోని ఉన్నాయ్.

కాబట్టి కన్నడ వాడిని అని చెప్పుకోవడం లో ఒక గర్వం ఉంటుంది.అయితే కమల్ హాసన్ ఏ రకంగా చుసిన కన్నడ చిత్ర పరిశ్రమతో సంబందం లేదు.

ఎందుకంటే కమల్ హాసన్ పుట్టింది ఒక తమిళ బ్రాహ్మణా కుటుంబంలో.తండ్రి శ్రీనివాసన్ ఒక లాయర్.

తల్లి రాజ్యలక్ష్మి ఒక గృహిణి.ఎన్ని పిచ్చి ప్రయోగాలు చేసిన అతడు ఒక గొప్ప నటుడు.

మొదట పార్థ సారధి అని పేరు పెట్టిన తండ్రి సమరయోధుడు కాబట్టి ముస్లిం మతాన్ని ఓన్ చేసుకుంటూ తనకు కమల్ అని పేరు మార్చాడు అంటూ ఈ మద్యే కమల్ చెప్పుకున్నాడు.

"""/"/ కమల్ అనే పేరుకు ముస్లిం మతానికి సంబంధం ఏంటో ఎంత స్టడీ చేసిన అర్ధం కాలేదు.

ఆ సంగతి కాసేపు పక్కన పెడితే ఆ మధ్య అంటే దాదాపు 1983 కు ముందు బాలు మహేంద్ర కోకిల అనే సినిమా తో కన్నడలో కనిపించాదు.

ఆ తర్వాత బాలచందర్ తో ఒక చిత్రం.ఇక ఈ మధ్య 2005 లో రామ శామా భామ అనే రీమేక్ చిత్రంలో కనిపించాడు.

ఇలా తమిళ్ తో లింక్ ఉన్న సినిమాలు తప్ప నేరుగా ఒక్క సినిమాలో కనిపించలేదు.

ఇక తెలుగు లో చాల స్ట్రెయిట్ సినిమాల్లో నటించాడు కాబట్టి తెలుగు వాడిని అంటే కాస్త బెటర్.

ఒక్క కాంతారా చాల మంది ని కళ్ళు తెరిపించినట్టు గా ఉంది.అందుకే అందరు క్యూ కట్టి మరి ఆ చిత్రాన్ని నెత్తికి ఎక్కించుకుంటున్నారు.

వారిద్దరి కోసమే కల్కి సినిమాలో నటించాను.. డైరెక్టర్ కి నేను లక్కీ కాదు: విజయ్ దేవరకొండ