ఈ వయస్సులో ఇదేం పని సల్మాన్.. బుట్టబొమ్మతో ప్రేమలో పడిన కండల వీరుడు!

తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో సల్మాన్ ఖాన్ కూడా ఒకరు.

సల్మాన్ ఖాన్ కు నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే బ్యాచిలర్ గా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.

వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సల్మాన్ ఖాన్ తన పెళ్లి పై మాత్రం దృష్టి పెట్టడం లేదు.

సల్మాన్ ఖాన్ ప్రేమించిన హీరోయిన్స్ అందరికీ పెళ్లి అయిపోతున్నా కానీ సల్లు బాయ్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే బ్యాచిలర్.

కాగా సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో పలువురు హీరోయిన్లతో సహజీవనం చేస్తున్నట్లుగా వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా కొంతమందితో లవ్ ఎఫైర్ కూడా నడిపినట్లు వార్తలు వినిపించాయి.ఇలా ఉంటే తాజాగా సల్మాన్ ఖాన్ మరొక హీరోయిన్ తో ప్రేమలో పడ్డట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

అయితే ఆ హీరోయిన్ మరెవరో కాదు బుట్ట బొమ్మ పూజ హెగ్డే.టాలీవుడ్లో పలు సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది హీరోయిన్ పూజా హెగ్డే.

సల్మాన్ ఖాన్ హీరోయిన్ పూజ హెగ్డే తో ప్రేమలో పడ్డాడట.అంతే కాకుండా సల్మాన్ ఖాన్ నెక్స్ట్ రెండు సినిమాలకు పూజ హెగ్డేనే హీరోయిన్ గా తీసుకున్నారట.

ఈ ప్రేమ పక్షులు సమయం దొరికినప్పుడల్లా కాలక్షేపం చేస్తున్నారంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

"""/"/సల్మాన్ ఖాన్ కు సన్నిహితులు కూడా కొందరు ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు.

అలాగే సన్నిహితులు కూడా ఇదే విషయం నిజమని అంటున్నారు అంటూ బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌, రివ్యూయర్‌ కేఆర్‌కే ట్వీట్‌ చేశాడు.

ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.రేయ్‌, ఏంట్రా ఇది మా బుట్టబొమ్మకు సల్మాన్‌ను అంటగడతారేంట్రా అని పూజా ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు.

సల్మాన్‌ ప్రేమిస్తాడు, కానీ పెళ్లి చేసుకోడులే అని కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తుండగా ఈ యవ్వారం అంతా నమ్మేట్లుగా లేదని మరికొందరు అనుమాన వ్యక్తం చేస్తున్నారు.

ఇంకొందరు మాత్రం ఇవన్నీ ఒట్టి గాసిప్సే అంటూ ఆ వార్తలను కొట్టి పారేస్తున్నారు.

భర్తతో విడిపోతే ప్రపంచం అంతమైపోయినట్లా.. సానియామీర్జాకు నటుడి సలహా ఇదే!